Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs AFG: తలకెక్కిన విజయ గర్వం.. అఫ్గాన్ చెత్త ఫీల్డింగ్! 6 క్యాచ్‌లు నేలపాలు..!

హైదరాబాద్: 'క్యాచెస్ విన్ మ్యాచెస్' అనేది క్రికెట్లో ఓ నానుడి. మ్యాచ్‌లు గెలవడంలో క్యాచులు ఎంత కీలకమో ఈ సామెత చెబుతుంది. క్యాచ్‌లు నేలపాలు చేసి భారీ మూల్యం చెల్లించుకున్న జట్లు క్రికెట్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఒక్క క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని శాసించిన ఘటనలు కూడా అనేకం.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2023లోనే ఆస్ట్రేలియా కీలక క్యాచ్‌లు నేలపాలు చేసి మూల్యం చెల్లించుకుంది. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన సునాయ క్యాచ్‌ను మిచెల్ మార్ష్ వదిలేయగా.. అతను సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగి అద్భుత విజయాన్ని అందించాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆసీస్ నాలుగు క్యాచ్‌లు నేలపాలు చేసి ఓటమి పాలైంది.

NZ vs AFG: Fans slams Afghanistan for drop six catches against New Zealand

తాజాగా అఫ్గానిస్థాన్ కూడా చెత్త ఫీల్డింగ్‌తో ఓటమి దిశగా సాగుతోంది. న్యూజిలాండ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఏకంగా 6 క్యాచ్‌లు నేలపాలు చేసింది. ఇందులో నాలుగు సునాయస క్యాచ్‌లు ఉండగా.. రెండు కష్టతరమైనవి. పరుగులను ఆపడంలోనూ విఫలమైన అఫ్గాన్ ఫీల్డర్లు.. ఓ రనౌట్‌తో పాటు స్టంపౌట్ అవకాశాన్ని కూడా చేజార్చారు.

ఈ అవకాశాలతో చెలరేగిన కివీస్ బ్యాటర్లు 289 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేశారు. ఫజలక్ ఫరూకీ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి విల్ యంగ్ ఇచ్చిన క్యాచ్‌ను రెహ్మత్ షా ఫస్ట్ స్లిప్‌లో నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీతో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు.

ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన 9వ ఓవర్ చివరి బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్‌లో షాహిది అందుకోలేకపోయాడు. రషీద్ ఖాన్ వేసిన 20 ఓవర్ రెండో బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన మరో సునాయ క్యాచ్‌ను కూడా అఫ్గాన్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాలతో 32 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. రెండో వికెట్‌కు విల్ యంగ్‌తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

రషీద్ ఖాన్ వేసిన 41 ఓవర్ చివరి బంతికి టామ్ లాథమ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీతో పాటు జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అఫ్గాన్ చెత్త ఫీల్డింగ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. విజయ గర్వం తలకెక్కిందని విమర్శలు గుప్పిస్తున్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన అఫ్గానిస్థాన్‌.. ఈ మ్యాచ్‌లో ఆ జోరు కొనసాగించలేకపోయిందని విమర్శిస్తున్నారు.

Story first published: Wednesday, October 18, 2023, 19:44 [IST]
Other articles published on Oct 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+