నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్‌పీఎల్)2024లో విచిత్రకర స్టంపౌట్ చోటు చేసుకుంది. వికెట్ కీపర్ తెలివికి బ్యాటర్ దిమ్మతిరిగింది. బ్యాట్స్‌మన్ అలసత్వాన్ని క్యాష్ చేసుకున్న వికెట్ కీపర్ స్మార్ట్‌గా స్టంపౌట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కర్ణాలీ యాక్స్(ఎన్‌పీఎల్) వర్సెస్ సుదర్ పాశ్చిమ్ రాయల్స్ మధ్య జరిగిన మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్స్ బౌలర్ హర్మీత్ సింగ్ వేసిన చివరి ఓవర్ చివరి బంతిని కర్ణాలీ బ్యాటర్ బిపిన్ శర్మ లెగ్ సైడ్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి వికెట్ కీపర్ ప్యాడ్స్ మధ్య ఇరుక్కుపోయింది.

అంపైర్ వైడ్ బాల్ ఇవ్వగా.. క్రీజులోనే ఉన్న బ్యాటర్ బిపిన్ శర్మ.. వికెట్ కీపర్ చేతులు ఖాళీగా ఉండటాన్ని గమనించి క్రీజు ధాటాడు. ఆ వెంటనే వికెట్ కీపర్ వినోద్ భండారి చాకచక్యంగా స్టంపౌట్ చేశాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు. వికెట్ కీపర్ తెలివికి ఫిదా అయ్యారు. వినోద్ భండారి జెర్సీ నెంబర్ 7ను ధరించడం విశేషం. ధోనీ కూడా జెర్సీ నెంబర్ 7ను ధరిస్తాడన్న విషయం తెలిసిందే. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇదెక్కడి స్టంపౌట్ రా అయ్యా.. బ్యాటర్ దిమ్మతిరిగింది'అంటూ కామెంట్ చేస్తున్నారు. తన కీపింగ్‌తో వినోద్ భండారి ధోనీని గుర్తు చేశాడని కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో సుదర్ పాశ్చిమ్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్నిల్ యాక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. అనంతరం సుదర్ పాశ్చిమ్ రాయల్స్ 15.2 ఓవర్లలోనే 4 వికెట్లకు 105 పరుగులు చేసి గెలుపొందింది.
— IndiaCricket (@IndiaCrick18158) December 16, 2024