Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. విన్నింగ్ షాట్ కొట్టమా లేదా: రింకూ సింగ్

ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు.

ఆఖరి ఓవర్‌‌లో టీమిండియాకు 10 పరుగులు అవసరమవ్వగా.. తిలక్ వర్మ సిక్స్ బాది, సింగిల్ తీయగా.. రింకూ సింగ్ బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క బంతి ఆడిన రింకూ సింగ్.. విన్నింగ్ షాట్‌తో మ్యాచ్ ఫినిషర్‌గా తన సత్తా చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రస్తావించగా.. రింకూ సింగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. 'ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. విన్నింగ్ షాట్ కొట్టమా లేదా'అని తెలిపాడు.

Nothing Else Matters Rinku Singh on Hitting the Winning Boundary in the Final
Photo Credit: X (twitter)

'ఎన్ని బంతులు ఆడామన్నది అనవసరం. ఈ ఒక్క బాల్ ముఖ్యం. జట్టు విజయానికి ఒక పరుగు కావాలి. నేను ఫోర్ కొట్టాను. నేను ఒక ఫినిషర్‌ అని అందరూ అంటారు. ఈ రోజు నాకు ఆ అవకాశం లభించింది. టీమ్ గెలిచింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ గెలుపుతో ఆసియా కప్‌లో టీమిండియా 9వ టైటిల్‌ను సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌పై ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్నందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. సహిబ్‌జాద ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్‌(4/30)నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా.. శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), సంజూ శాంసన్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్(3/29) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

Story first published: Monday, September 29, 2025, 0:37 [IST]
Other articles published on Sep 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+