Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జైస్వాల్ కాదు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటేది అతనే: ఆసీస్ మాజీ కెప్టెన్

టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ కుర్రాడికి అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక రెండో టెస్ట్‌లో భారత్-ఏ తరఫున ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడని గుర్తు చేశాడు.

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారతే గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై రెండు సార్లు విజయం సాధించింది.

Not Yashasvi Jaiswal Former Australia Captain feels Dhruv Jurel To Shine in Border-Gavaskar Trophy

సర్వత్రా ఆసక్తి..
ఈ క్రమంలోనే ప్రస్తుతం కాస్త బలహీనంగా ఉన్న భారత్‌ను ఓడించాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను భారత్ 4-0తో గెలవాలి. దాంతోనే ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఓ రేడియో స్టేషన్‌లో ఈ సిరీస్‌పై మాట్లాడిన టీమ్ పైన్.. ధ్రువ్ జురెల్‌‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. వికెట్ కీపర్ అయిన అతన్ని ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

అతని బ్యాటింగ్‌కు అవాక్కయ్యాం..
'భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ మధ్య జరిగిన మ్యాచ్ హైలైట్స్ చూశారో లేదో నాకు తెలియదు. కానీ ఆస్ట్రేలియా-ఏతో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చూసిన తర్వాత అతన్ని తుది జట్టులోకి తీసుకోవాల్సిందనే అభిప్రాయం కలిగింది. వికెట్ కీపర్ అయినా అతన్ని తుది జట్టులో ఆడించాల్సిందే.

ఎందుకంటే గత కొంతకాలంగా భారత బ్యాటింగ్ విభాగం తడబడుతోంది. ఆస్ట్రేలియా ఏతో అతను చేసిన 80 పరుగుల ఇన్నింగ్స్‌ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా స్టాఫ్ మొత్తం అతన్ని బ్యాటింగ్‌కు నోరెళ్లబెట్టింది. మాలోని ప్రతీ ఒక్కరు.. ఈ కుర్రాడు అద్భుతంగా ఆడగలడని అనుకునేలా చేసింది.

టెస్ట్ క్రికెట్‌కు సరిపోయే ఆటగాడు..
ప్రస్తుతం అతని వయసు 23 ఏళ్లే. ఇప్పటి వరకు అతను మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ తనకన్నా ఎంతో అనుభవం ఉన్న సహచర ఆటగాళ్ల కంటే అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. పేస్, బౌన్స్‌ను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. అసాధారణ భారత ఆటగాడిగా కనిపించాడు.

ఈ సమ్మర్‌లో అతనిపై ఓ కన్నేయండి. నాకెందుకో అతను ఆస్ట్రేలియా అభిమానులను బాగా ఆకట్టుకుంటాడనిపిస్తోంది. ఆస్ట్రేలియా బిగ్ త్రీ పేసర్స్ కమిన్స్, స్టార్క్, హజెల్‌వుడ్‌లను కూడా చితక్కొడుతాడనిపిస్తోంది. టెస్ట్ క్రికెట్‌కు సరిపోయే ఆటగాడిలా కనిపిస్తున్నాడు.'అని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 80, 68 హాఫ్ సెంచరీలతో రాణించాడు. భారత బ్యాటర్లంతా విఫలమైన వేళ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

Story first published: Tuesday, November 12, 2024, 12:35 [IST]
Other articles published on Nov 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+