Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022 పరాజయం టీమిండియా మంచికే.. తలకెక్కిన గర్వం తెలుసొచ్చింది!

Not worried about India defeats in Asia Cup 2022

హైదరాబాద్: 'నేటి ఓటమి రేపటి విజయానికి తొలి మెట్టు'అంటారు పెద్దలు. కాబట్టి ఆసియాకప్ 2022 పరాభావం కూడా టీమిండియా మంచికే. ఈ ఓటమిని మనం జీర్ణించుకోలేకపోతున్నా.. మనకంటే బలహీనమైన జట్ల చేతిలో ఓడామనే బాధ వెంటాడుతున్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగి ఉత్తి చేతులతో ఇంటిదారి పట్టామనే పరాభావాన్ని మూటగట్టుకున్నా.. టీ20 ప్రపంచకప్ గెలవాలనే మన అంతిమ లక్ష్యం ముందు ఎదురైన ఈ పరాజయం మన మంచికే. వరుస విజయాలతో తలకెక్కిన ఆటగాళ్లు పొగరు ఈ పరాజయంతో ఒక్కసారిగా నీరుగారిపోయింది.

 నేలను తాకిన గర్వం..

నేలను తాకిన గర్వం..

మాకు ఎదురేలేదని విర్రవీగిన ఆటగాళ్ల గర్వం ఈ అనూహ్య ఓటమితో నేలను తాకింది. ముఖ్యంగా జట్టు బలహీనతలు బయటపడ్డాయి. ఈ ఉత్కంఠ మ్యాచ్‌లతో ఆటగాళ్ల అసలు సామర్థ్యం తెలిసింది. కెప్టెన్‌గా తిరుగులేదని భావించిన రోహిత్ శర్మ‌కు అంతర్జాతీయ స్థాయిలో సారథ్యం ఆశమాషి వ్యవహారం కాదనే అసలు విషయం బోధపడింది. మొత్తానికి ఆటగాళ్లతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐకి తాము ఎంత మెరగువ్వాలనే విషయం తెలుసొచ్చింది. ఎక్కడ నెగ్గాలో.. కాదు ఎక్కడ తగ్గాలో బోధపడింది.

రోహిత్ శర్మ సైతం..

రోహిత్ శర్మ సైతం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఈ అనూహ్య ఓటమి తమకు ఓ గుణపాఠంగా పేర్కొన్నాడు. టీమ్ కాంబినేషన్‌లో చేయాల్సిన మార్పుల గురించి కాస్త క్లారిటీ వచ్చిందన్నాడు. వ్యూహాత్మక మార్పులు, ఆటగాళ్ల సత్తాపై తనకు ఓ అంచనా ఏర్పడిందన్నాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం జరిగిన ప్రతీ టీ20 సిరీస్‌లో టీమిండియా గెలిచింది. ఏ, బీ, సీ టీమ్స్‌ విజయాలందుకున్నాయి. స్వదేశం, విదేశం తేడా లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్లాయి. కానీ అసలు సిసలు సమరం టీ20 ప్రపంచకప్ ముందు ట్రైలర్‌గా జరుగుతున్న ఈ ఆసియా కప్ టోర్నీలో రోహిత్ సేనకు చుక్కెదురైంది.

హార్దిక్‌ సరైనోడు కాదని..

హార్దిక్‌ సరైనోడు కాదని..

ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు అంటూ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. సంప్రదాయానికి భిన్నంగా ఇద్దరేసి స్పెషలిస్ట్ స్పిన్నర్లు, పేసర్లు.. ఓ పేస్ ఆల్‌రౌండర్, స్పిన్ ఆల్‌రౌండర్‌తో ముందుకెళ్లడం ఏ మాత్రం మంచిది కాదనే విషయం బోధపడింది. అంతకు మించి పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను నమ్ముకోవడం ఎంత నష్టమో తెలుసొచ్చింది. పాకిస్థాన్‌పై ఆల్‌రౌండ్‌షోతో విజయాన్నందించిన హార్దిక్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అతన్ని మూడో పేసర్‌గా పరగణించడం కూడా కరెక్ట్ కాదనే అసలు విషయం బోధపడింది.

 ఫినిషర్ అవసరం ఏంటో..?

ఫినిషర్ అవసరం ఏంటో..?

జట్టులో ఫినిషర్ రోల్ ఎవరిదనేదానిపై కూడా రోహిత్ సేనకు క్లారిటీ వచ్చింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం దినేశ్ కార్తీక్‌ను కాదని రిషభ్ పంత్‌ను తీసుకోవడం ఎంత తప్పిదమో తెలుసొచ్చింది. బౌలింగ్ సత్తా ఎంటో తెలిసింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఎవరి సామర్థ్యం ఏంటో అనే విషయంపై క్లారిటీ వచ్చింది. నలుగురు పేసర్లను జట్టులో ఉంచుకోవడం.. అందులో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన పేసర్ల విలువ ఏంటో బోధపడింది. బిగ్ హిట్టింగ్ చేయగల దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి బౌలర్ల లేని లోటు తెలిసొచ్చింది. కాబట్టి గర్వం తలకెక్కిన భారత ఆటగాళ్లకు ఈ పరాజయం ఓ గుణపాఠం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Story first published: Wednesday, September 7, 2022, 19:20 [IST]
Other articles published on Sep 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+