For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కాదు.. ఫిట్‌నెస్‌ కా బాప్ అతనే! రోజుకి 800 పుషప్స్!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిట్టెస్ట్ క్రికెటర్ ఎవరా? అంటే అంతా విరాట్ కోహ్లీ పేరే చెబుతారు. ఎందుకంటే ఫిట్‌నెస్‌పై అంతగా విరాట్ కోహ్లీ ప్రభావం చూపించాడు. టీమిండియాలోకి ఫిట్‌నెస్ విప్లవం తీసుకొచ్చిందే కోహ్లీ. 2014 ఆసీస్ పర్యటనలో ఫిట్‌నెస్ ప్రాధాన్యతను గ్రహించిన కోహ్లీ.. ముందుగా తాను ఫిట్‌గా మారి ఆ తర్వాత జట్టులోకి కూడా ఆ సంప్రదాయాన్ని తీసుకొచ్చాడు. కఠినమైన డైట్‌తో పాటు వ్యాయామాలతో ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేశాడు.

దాంతో అతనికి ఫిట్టెస్ట్ క్రికెటర్‌గా గుర్తింపు లభించింది. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ కంటే ఫిట్టెస్ట్ క్రికెటర్లు చాలానే ఉన్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెటర్ గ్లేన్ ఫిలిప్స్ ఫిట్‌నెస్ కా బాప్ అని చెప్పొచ్చు. మైదానంలో చేసే అతను ఫీల్డింగ్ విన్యాసాలే ఇందుకు నిదర్శనం. పక్షిలా గాల్లోకి ఎగురుతూ అలవోకగా క్యాచ్‌లు పట్టగలడు. జట్టు కోసం వికెట్ కీపింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగలడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించగలడు.

Not Virat Kohli This New Zealand All-Rounder Is the Fittest Cricketer in the World Does 800 Push-Ups a Day

రోజుకి 800 పుషప్స్..

న్యూజిలాండ్ సవ్యసాచిగా గ్లేన్ ఫిలిప్స్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. రోజుకి 800 పుషప్స్ చేయడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని ఈ కివీస్ ఆల్‌‌రౌండర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'జిమ్‌లో బాగా కష్టపడటంతోనే అలవోకగా సిక్స్‌లు కొట్టగలుగుతున్నాను. నేను కాస్త బరువు పెరిగానని గ్రహించిన వెంటనే బరువులు ఎత్తడం మొదలుపెట్టాను. జిమ్‌లో హార్డ్ వర్కౌట్స్ కారణంగా నా ఆటను సునాయసంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ముఖ్యంగా నా బలం ఎంటో తెలుసుకోవడం.. భారీ షాట్స్ ఆడేందుకు కావాల్సిన లైన్ అండ్ లెంగ్త్ ఎంటో గ్రహించడం వంటి విషయాలు బాగా అర్థమయ్యాయి.

బాడీ వెయిట్ ఎక్సర్‌సైజ్..

ఒకానొక సందర్భంలో నేను రోజుకు 800 పుషప్స్ కొట్టేవాడిని. సెట్‌కు 300, 300, 200 పుషప్స్ పూర్తి చేసేవాడిని. కనీసం 300, 200 పుషప్స్ సెట్స్‌తో 500 పుషప్స్ కొట్టేవాడిని. ఇతర జిమ్ వర్కౌట్స్ ఆధారంగా పుషప్స్‌ను ప్లాన్ చేసుకునేవాడిని. కార్టియో, స్ట్రెంగ్త్ ఎక్సర్‌సైజుల ఆధారంగా నా పుషప్స్ ప్లాన్ ఉండేది. నేను ఎక్కువగా బాడీ వెయిట్ ఎక్స్‌ర్‌సైజ్‌లకు ప్రాధాన్యత ఇచ్చేవాడిని. పుషప్స్ సంఖ్య పెరగడానికి బెంచ్ ప్రెస్, బెంచ్ పుల్ వర్కౌట్స్‌ నాకు ఉపయోగపడ్డాయి. 'అని గ్లేన్ ఫిలిప్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సాధారణ సగటు మనిషి 30 పుషప్స్ చేయడమే చాలా కష్టం. అలాంటిది రోజుకు 800 పుషప్స్.. సెట్‌కు 300 ఫుషప్స్ అంటే మాటలా? అందుకే గ్లేన్ ఫిలిప్స్‌ను ఫిట్‌నెస్‌ కా బాప్ అని ఫిట్‌నెస్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

Story first published: Friday, October 17, 2025, 13:13 [IST]
Other articles published on Oct 17, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+