Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కాదు.. కష్టకాలంలో ధోనీనే ఎంచుకుంటా: రవీంద్ర జడేజా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తనకున్న అభిమానం, ప్రేమను వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి చాటుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వీడి రాజస్థాన్ రాయల్స్‌లో చేరినా మహీ భాయ్‌పై తనకున్న గౌరవం, ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదని స్పష్టం చేశాడు.

తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ షేర్ చేసిన ఓ వీడియోలో ధోనీపై తనకున్న నమ్మకం, గౌరవాన్ని జడేజా చాటుకున్నాడు. తన ప్రాణాలు రిస్క్‌లో ఉంటే కాపాడేందుకు మహేంద్ర సింగ్ ధోనీనే ఎంచుకుంటానని స్పష్టం చేశాడు.

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

ధోనీనే నా సేవియర్..

రాజస్థాన్ రాయల్స్ షేర్ చేసిన ఈ ర్యాపిడ్ ఫైర్ వీడియోలో.. 'మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించేందుకు ఏ బ్యాటర్‌ను ఎంచుకుంటారు? అని ప్రశ్నించగా.. జడేజా క్షణం ఆలోచించకుండా ధోనీ పేరు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలం ధోనీ సారథ్యంలోని ఆడిన జడేజా.. మహీపై తనకున్న విశ్వాసాన్ని ఈ కామెంట్స్ ద్వారా చాటుకున్నాడు.

Not Virat Kohli Ravindra Jadeja Chooses MS Dhoni as the Batter He d Trust With His Life

క్రికెట్‌లో మరుపురాని క్షణం గురించి అడగ్గా.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మీదుగా టెస్ట్ క్యాంప్ అందుకోవడం తన జీవితంలో అత్యంత మరుపురాని క్షణమని గుర్తు చేసుకున్నాడు. 2012 డిసెంబర్ 13న నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను తొలి ఇన్నింగ్స్‌లో రెండు , రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 12 పరుగులు చేశాడు.

దిగ్గజాలతో కలిసి..

ఐపీఎల్ 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన రవీంద్ర జడేజా.. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 17 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

అశ్విన్ తయారు చేసిన జడేజా 2.O.. హర్ష్‌దూబే వెనుక పుట్టెడు దు:ఖం!

అశ్విన్ తయారు చేసిన జడేజా 2.O.. హర్ష్‌దూబే వెనుక పుట్టెడు దు:ఖం!

ఈ సుదీర్ఘ కెరీర్‌లో జడేజా.. సచిన్, రాహుల్ ద్రవిడ్, ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఐపీఎల్‌లో షేన్ వార్న్, షేన్ వాట్సన్, బ్రెండన్ మెక్‌కల్లమ్, మైఖేల్ హస్సీ, బెన్ స్టోక్స్, మహేళ జయవర్దనే వంటి ఆటగాళ్లతో కలిసి కూడా ఆడాడు. ధోనీ సారథ్యంలో 100కు పైగా ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లను జడేజా ఆడాడు. ఐపీఎల్‌లో ధోనీకి డిప్యూటీగా కూడా జడేజా వ్యవహరించాడు.

Story first published: Wednesday, July 29, 2026, 19:16 [IST]
Other articles published on Jul 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+