కోహ్లీ కాదు.. అతనే ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయర్: అంబటి రాయుడు
వెస్టిండీస్ దిగ్గజం, కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) స్పిన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌పై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. సునీల్ నరైన్ ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయర్ అని కొనియాడాడు. బంతితో పాటు బ్యాట్‌తో రాణించే మ్యాచ్ విన్నర్ అని ప్రశంసించాడు.
తాజాగా ఈఎస్‌పీఎన్ క్రికెట్ ఇన్‌ఫోతో మాట్లాడిన అంబటి రాయుడు.. సునీల్ నరైన్ ప్రదర్శనను కొనియాడాడు. అతన్ని ఎదుర్కోవడం ఏ బ్యాటర్‌కైనా కష్టమేనని తెలిపాడు.
నరైన్ ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్..
'నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్ చరిత్రలోనే సునీల్ నరైన్ అత్యుత్తమ ఆటగాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ మ్యాచ్‌లను గెలిపించగల అసలైన మ్యాచ్ విన్నర్. ఐపీఎల్‌లో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ సునీల్ నరైన్ ఎప్పుడూ అందరి కంటే ప్రత్యేకంగా నిలుస్తాడు. నా జాబితాలో అతను ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటాడు.' అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.

సునీల్ నరైన్ సుదీర్ఘకాలంగా నిలకడగా రాణించడానికి గల కారణాన్ని కూడా రాయుడు చెప్పాడు. అంతేకాకుండా గత రెండు సీజన్లలో విఫలమైన రషీద్ ఖాన్‌తో సునీల్ నరైన్‌కు ఉన్న వ్యత్యాసాన్ని కూడా నరైన్ వివరించాడు. ఆరు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయుడు.. ఒక బ్యాటర్‌గా నరైన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.
రషీద్, నరైన్‌కు ఉన్న తేడా ఇదే..
'రషీద్ ఖాన్‌కు ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది. రషీద్ ఖాన్ వేసే బంతుల్లో ఎక్కువ భాగం 'టాప్‌స్పిన్నర్స్' ఉంటాయి. ఈ రకమైన బంతులు పిచ్‌పై పడినప్పుడు, అవి స్కిడ్ అవుతూ.. చాలా వేగంగా బ్యాట్‌పైకి దూసుకువస్తాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌కు అనుకూలించే ఫ్లాట్ పిచ్‌లపై, బంతి అలా వేగంగా బ్యాట్‌పైకి రావడం వల్ల బ్యాటర్లు సునాయసంగా షాట్లు ఆడగలుగుతారు.
కానీ సునీల్ నరైన్ వేసే బంతులు రషీద్ ఖాన్ బంతుల్లా బ్యాట్‌పైకి వేగంగా దూసుకురావు. అతని బంతి పిచ్‌పై ఆగుతూ వస్తుంది. అతని బంతి ఎప్పుడూ బ్యాట్‌పైకి స్కిడ్ అవ్వదు. దాంతో బంతి ఏ వేగంతో వస్తుందో, ఎంత టర్న్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు చాలా కష్టంగా మారుతుంది. దీని వల్ల బ్యాటర్లు తమ షాట్ షేప్ కోల్పోతుంటారు.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
గత శనివారం (మే 16) గుజరాత్ టైటాన్స్ (GT)పై కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సాధించిన విజయంలో సునీల్ నరైన్ కీలక పాత్ర పోషించాడు. రెండు కీలక వికెట్లు తీసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌తో సునీల్ నరైన్ ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఓవర్‌సీస్ ప్లేయర్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications