Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభమన్ గిల్ కాదు.. అతనే ఉపఖండం రారాజు: అశ్విన్

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌‌కు ముందు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు తన బాధ్యతలపై మేనేజ్‌మెంట్ స్పష్టతనిస్తే ఉప ఖండపు రారాజుగా ఎదుగుతాడని తెలిపాడు. సర్ఫరాజ్ ఖాన్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడగలడని అభిప్రాయపడ్డాడు.

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. శనివారం(ఆగస్ట్ 15) నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మొదలవ్వనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ బెర్త్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ సిరీస్‌ గెలవడం టీమిండియాకు కీలకం. అయితే భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి గాయాలతో జట్టుకు దూరమయ్యారు. సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు.

Not Shubman Gill R Ashwin Names Sarfaraz Khan as Potential King of the Subcontinent

అతనికి క్లారిటీ ఇస్తే రారాజు అవుతాడు..

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన అశ్విన్.. సర్ఫరాజ్ ఖాన్‌కు తన బాధ్యతల గురించి క్లారిటీ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. 'సాయి సుదర్శన్ గాయంతో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. సర్ఫరాజ్‌కు జట్టులో తన పాత్రపై క్లారిటీ ఇవ్వాలి. కొన్ని కండిషన్స్‌లో అతని సామర్థ్యంపై సందేహం ఉంటే ఆ విషయాన్ని అతనికి చెప్పాలి. ఉపఖండం కండిషన్స్‌లోనే నువ్వు రాణించగలవు, అప్పుడే నీకు అవకాశం ఇస్తామని చెప్పాలి.

అప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా తన సమయాన్ని వృథా చేసుకోడు. మంచి స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలో మరింత ఫోకస్ పెడుతాడు. ఉంపఖండపు పరిస్థితుల్లో రారాజుగా మారుతాడు. తన కెరీర్‌ను నిర్మించుకుంటాడు. స్పిన్ కాకుండా ఇతర కండీషన్స్‌లో అతను రాణించలేడని భావిస్తే.. ఆ విషయాన్ని అతనికి చెప్పాలి.'అని అశ్విన్ సూచించాడు.

ఆ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెనే సీఎస్‌కే హెడ్ కోచ్‌: అశ్విన్

Also Read

ఆ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెనే సీఎస్‌కే హెడ్ కోచ్‌: అశ్విన్

సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కెనా..?

అయితే తుది జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు బదులు ముందుగా ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. గాలె స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ధ్రువ్ జురెల్‌కు బదులు సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగలడని పేర్కొంటున్నారు. మరోవైపు ధ్రువ్ జురెల్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం దక్కుతుందా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Story first published: Friday, August 14, 2026, 10:58 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+