ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించాలంటే తుది జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా ఉండాలని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అన్నాడు. ఈ మ్యాచ్ గెలవడం భారత్‌కు కీలకమని, బుమ్రా లేకుండా బరిలోకి దిగడం సరైన నిర్ణయం కాదన్నాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో టీమిండియా 1-2తో వెనుకంజలో నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టెయిలెండర్స్ సాయంతో ఆఖరి సెషన్ వరకు రవీంద్ర జడేజా చేసిన పోరాటం వృథా అయ్యింది. అయితే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా మరో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది.
ఈ సిరీస్‌కు ముందే బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని చెప్పాడు. ఈ క్రమంలోనే అతను రెండో టెస్ట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. మూడో టెస్ట్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. నాలుగో టెస్ట్‌కు బుమ్రా దూరమవుతాడనే ప్రచారం జరుగుతుంది. అయితే నాలుగో టెస్ట్‌లో బుమ్రా ఖచ్చితంగా ఆడించాలని దీప్ దాస్ గుప్తా సూచించాడు. నాలుగో టెస్ట్‌కు 8 రోజుల విశ్రాంతి లభించిందని, రికవరీ అయ్యేందుకు బుమ్రాకు ఈ విశ్రాంతి సరిపోతుందని చెప్పాడు.

'నాలుగో టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఆడాలంటే ఖచ్చితంగా ఆడాల్సిందే. బుమ్రాను టీమిండియా తొలి, మూడు, ఐదో టెస్ట్ ఆడించాలనే ప్లాన్ గురించి విన్నాను. కానీ ప్రస్తుతం భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. నాలుగో టెస్ట్ చాలా కీలకం. కాబట్టి వరల్డ్ బెస్ట్ బౌలర్ అయిన బుమ్రాను బరిలోకి దించాల్సిందే. నాలుగో టెస్ట్‌కు ముందు 8 రోజుల విశ్రాంతి లభించింది. ఐదో టెస్ట్ కంటే నాలుగో టెస్ట్‌లో బుమ్రాను ఆడించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది.'అని స్టార్ స్పోర్ట్స్‌తో దీప్ దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ జులై 23 నుంచి ప్రారంభం కానుంది.