Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్, కోహ్లీ కాదు.. అతనే ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్: రికీ పాంటింగ్

ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ ఎవరా? అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరు చెబుతారు. ఇంకొందరు విరాట్ కోహ్లీ, వీవీ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజాల పేర్లను సూచిస్తారు. కానీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం కొత్త పేరును సూచించాడు. సౌతాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లీస్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ అని పేర్కొన్నాడు.

'జాక్వెస్ కల్లిస్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్. మిగతా వారి గురించి నాకు తెలియదు. నా దృష్టిలో మాత్రం కల్లిస్ అత్యుత్తమ క్రికెటర్. టెస్ట్‌ల్లో 13 వేల పరుగులతో పాటు 45 సెంచరీలు, 300 వికెట్లు తీసాడు. మిగతా వారంతా తమ కెరీర్‌లో బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో మాత్రమే అత్యుత్తమ గణంకాలు నమోదు చేశారు. కానీ కల్లిస్‌లా అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చలేదు.

Not Sachin Or Kohli Ricky Ponting picks Jacques Kallis As All Time Greatest Cricketer

కల్లిస్ ఫీల్డింగ్‌ కూడా అసాధారణం. స్లిప్స్‌లో అతను అసాధారణ ఫీల్డర్. కానీ అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఎందుకంటే కల్లిస్ వ్యక్తితత్వం భిన్నంగా ఉంటుంది. అతను ఎక్కువగా మాట్లాడాడు. దాంతో అతన్ని మీడియా ఎక్కువగా హైలైట్ చేయలేదు.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

జాక్వస్ కల్లీస్ 19 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో సౌతాఫ్రికా తరఫున 166 టెస్ట్‌లు, 328 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో 13289 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్(15,291), రికీ పాంటింగ్(13,378) తర్వాతి స్థానంలో నిలిచాడు. వన్డేల్లోనూ 11,579 పరుగులు నమోదు చేశాడు. 519 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 338 క్యాచ్‌లు అందుకున్నాడు.

Story first published: Tuesday, February 4, 2025, 16:52 [IST]
Other articles published on Feb 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+