Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ కాదు.. అతనితో కలిసి ఆడటం నా కల: సర్ఫరాజ్ ఖాన్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన ఆశయమని యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఆడినప్పుడు కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఓ కలగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సందర్భంగా కోహ్లీతో కలిసి సర్ఫరాజ్ ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నా.. టీమిండియా తరఫున ఆ అవకాశం దక్కలేదు.

ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. తన కొడుకు అకాయ్ లండన్‌లో జన్మించడంతో అక్కడే ఫ్యామిలీతో గడిపాడు.

Not Rohit Sharma Sarfaraz Khan says Dream To Share Indian Dressing Room with Virat Kohli

బంగ్లాదేశ్‌‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యులతో కూడిన జట్టులో విరాట్ కోహ్లీతో పాటు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో మాట్లాడిన సర్ఫరాజ్ ఖాన్.. కోహ్లీతో కలిసి ఆడటం తన కల అని చెప్పుకొచ్చాడు.

'క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీకి ఉన్న అభిరుచి, మక్కువ అసాధారణం. అతన్ని ఎప్పుడూ చూసినా కుర్రాళ్లతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ప్రీ మ్యాచ్ సమావేశాల్లో అయితే.. ప్రతీ ఒక్కరికి ప్రత్యర్థి బౌలర్‌పై ఎన్ని పరుగులు చేశానని వివరిస్తూ.. కుర్రాళ్ల భయాన్ని తొలగిస్తాడు.

విరాట్ కోహ్లీని నేను తొలిసారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చూశాను. ఆ మ్యాచ్‌లో నేను 21 బంతుల్లో 45 పరుగులు చేశాను. ఈ ఇన్నింగ్స్ ఫిదా అయిన అతను.. నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆ రోజు చాలా సరదాగా సాగింది. అతనితో కలిసి భారత డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం నా డ్రీమ్. నాకు అవకాశం లభిస్తే త్వరలోనే ఆ కల నెరవేరుతుందనుకుంటున్నా.'అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికైనా.. అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. కేఎల్ రాహుల్‌తో అతనికి పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే అతన్ని దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ మ్యాచ్‌కు ఎంపిక చేశారు.

Story first published: Monday, September 16, 2024, 21:05 [IST]
Other articles published on Sep 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+