Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరంటే..?

ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాల సమర్పణకు గురువారంతో గడువు ముగియడంతో ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు 10 జట్ల రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఒక్కో జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలను వెల్లడించాయి.

అందరూ ఊహించినట్లుగానే ముంబై ఇండియన్స్ తమ కోర్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అనూహ్యంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను తమ ఫస్ట్ రిటెన్షన్‌గా రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలను రూ. 16.35 కోట్లకు అట్టిపెట్టుకుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను నాలుగో ప్లేయర్‌గా రూ. 16 కోట్లకు రిటైన్ చేసుకుంది.

Not Rohit Sharma Mumbai Indians Confirm Their Captain For IPL 2025

యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ తన సాలరీ క్యాప్‌ను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ ఐదుగురి ఆటగాళ్ల కోసం ముంబై ఇండియన్స్ రూ. 70 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్టు పర్స్‌లో ఇంకా రూ. 50 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బుతోనే ముంబై దాదాపు 17 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది.

ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడంతో ముంబై ఇండియన్స్‌కు ఒక ఆర్‌టీఎమ్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్ ద్వారా ఇషాన్ కిషన్‌ను వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చు. లేదా ఇతర ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ ఎవరో వెల్లడించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యానే సారథ్యం వహిస్తాడని పేర్కొంది.

సూర్యకుమార్ యాదవ్ లేదా రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపడుతాడని జరిగిన ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఐపీఎల్ రిటెన్షన్ ఉద్దేశించి హార్దిక్ పాండ్యా మాట్లాడిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్:

జస్‌ప్రీత్ బుమ్రా-రూ. 18 కోట్లు

సూర్యకుమార్ యాదవ్-రూ. 16.35 కోట్లు

హార్దిక్ పాండ్యా-రూ. 16.35 కోట్లు

రోహిత్ శర్మ-రూ. 16.30 కోట్లు

తిలక్ వర్మ-రూ. 8 కోట్లు

రిటెన్షన్‌కు ఖర్చు అయిన డబ్బులు: రూ. 70 కోట్లు

పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ. 50 కోట్లు

ముంబై రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా

బ్యాటర్లు: డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్(కీపర్), టీమ్ డేవిడ్, విష్ణు వినోద్

ఆల్‌రౌండర్లు: అర్జున్ టెండూల్కర్, మహమ్మద్ నబీ, రోమారియో షెఫెర్డ్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, గెరాల్డ్ కోయిట్జీ, అన్షుల్ కంబోజ్, నమన్ ధిర్, శివలిక్ శర్మ

బౌలర్లు: క్వెన మఫకా, పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయా సింగ్, ఆకాశ్ మధ్వాల్, లూక్ వుడ్, దిల్షాన్ మదుషంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషారా .

Story first published: Thursday, October 31, 2024, 18:36 [IST]
Other articles published on Oct 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+