టీమిండియా యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరూ టీమిండియా భవిష్యత్తు స్టార్స్ అని కొనియాడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో గిల్, జైస్వాల్ దుమ్మురేపుతారని జోస్యం చెప్పాడు.
బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాన్పూర్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా అసాధారణ ప్రదర్శన కనబర్చిన అశ్విన్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్‌లో అశ్విన్‌కు ఇది 11వ టెస్ట్ సిరీస్. దాంతో అతను ముత్తయ్య మురళీదరణ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ల రికార్డ్‌ను సమం చేశాడు.

ఈ అవార్డ్‌ను అందుకునే క్రమంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో యశస్వి, శుభ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
'యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు. టెస్ట్ క్రికెట్‌లో ఈ ఇద్దరూ దుమ్మురేపుతారు. భవిష్యత్తులో టీమిండియాకు పిల్లర్స్‌గా నిలుస్తారు. ముఖ్యంగా ఓవర్‌సీస్ కండిషన్స్‌లో పరుగుల మోత మోగిస్తారు. మాతో కలిసి ఈ ఇద్దరూ మరింత అనుభవాన్ని సంపాదిస్తారు. తమ టెస్ట్ ప్రయాణంలో మరింత రాటు దేలుతారు. 'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఈ టెస్ట్ సిరీస్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ హయ్యెస్ట్ రన్ స్కోరర్లుగా నిలిచారు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో యశస్వి జైస్వాల్ 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గిల్ 54.67 సగటుతో 164 పరుగులు చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ శతకం సాధించాడు.