గౌతం గంభీర్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను నియమించాలని వెటరన్ బ్యాటర్, టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అన్నాడు. గంభీర్ తర్వాత ధోనీ టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికవ్వాలని మెజార్టీ అభిమానులు కోరుకుంటుంటే పుజారా మాత్రం అశ్విన్ పేరు సూచించాడు. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్‌తో తాజాగా జరిగిన ఫన్ ఇంటరాక్షన్‌లో పుజారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా తన టీమ్‌మేట్స్‌లో ఒకర్ని ఎంచుకోమని పుజారాను ప్రశ్నించగా అశ్విన్ పేరు సూచించాడు. 24 గంటలు అశ్విన్ క్రికెట్ గురించే చర్చిస్తుంటాడని తెలిపాడు. సచిన్ టెండూల్కర్ తనను బాగా చూసుకునేవాడని, అన్ని రికార్డులు బద్దలు కొట్టే ఆటగాడు విరాట్ కోహ్లీ అని చెప్పాడు. జుట్టుకు కలర్ వేయాలనుకుంటున్న టీమ్‌మెట్ ఎవరా? అని అడగ్గా ధోనీ పేరు సూచించాడు.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 106 టెస్ట్‌లు ఆడిన అశ్విన్ 537 వికెట్లు తీసాడు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ ఆడుతున్న అశ్విన్.. యూట్యూబ్ ఛానెల్ వేదికగా క్రికెట్ విశ్లేషణలు, పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత పుజారా మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. 2010లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పుజారా.. అశ్విన్‌తో కలిసి సుదీర్ఘ కాలం ఆడాడు. ఇంకా రిటైర్మెంట్ ప్రకటించని పుజారా.. రంజీ ట్రోఫీ 2025-26 కోసం సమయాత్తమవుతున్నాడు.