Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే అత్యుత్తమ బ్యాటర్: బాబర్ ఆజామ్

తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్ సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్ ఆజామ్ విషయాన్ని వెల్లడించాడు. బాబర్ ఆజామ్ సమాధానం విని ఏబీ డివిలియర్స్ ఆశ్చర్యపోయాడు.

మరోసారి ఇదే ప్రశ్నను అడగ్గా.. బాబర్ ఆజామ్..'నువ్వే.. ఏబీ'అని బదులిచ్చాడు. దాంతో డివిలియర్స్ నవ్వు ఆపుకోలేకపోయాడు. తాను ఇతర దేశాల ఆటగాళ్ల పేర్లు చెబుతావనుకున్నానని ఏబీ డివిలియర్స్ అనగా.. ఈ ప్రశ్నకు తన సమాధానం ఎప్పటికీ ఏబీ డివిలియర్సేనని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 ముందు చేసిన ఇంటర్వ్యూ అని ఏబీడీ రాసుకొచ్చాడు.

Not Kohli or Rohit Babar Azam Picks best batsman he played against in his career

వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో బాబర్ ఆజామ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతన్ని తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు ఫ్రాంచైజీ టీ20 లీగ్స్ ఆడేందుకు పాకిస్థాన్ ప్రధాన ఆటగాళ్లకు పీసీబీ అనుమతి ఇవ్వడం లేదు. కెనడా టీ20 లీగ్ ఆడేందుకు సిద్దమైన బాబర్ ఆజామ్, రిజ్వాన్‌లతో పాటు ఇతర ఆటగాళ్లకు పీసీబీ నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వలేదు.

పాకిస్థాన్ జట్టు ప్రధాన ఆటగాళ్లకు ఎన్‌ఓసీ ఇచ్చే ప్రసక్తే లేదని పీసీబీ స్పష్టం చేసింది. పాకిస్థాన్ క్రికెట్ షెడ్యూల్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. డబ్ల్యూటీసీ‌ 2025‌లో భాగంగా పాకిస్థాన్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, ఛాంపియన్స్ ట్రోఫీకి 2025 సిద్దం కావాల్సి ఉందని స్పష్టం చేసింది. తమ ఆటగాళ్ల‌పై వర్క్ లోడ్ పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

Story first published: Monday, July 22, 2024, 21:52 [IST]
Other articles published on Jul 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+