Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే నా ఆరాధ్య క్రికెటర్: నితీష్ కుమార్ రెడ్డి

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్‌రౌండర్, టీమిండియా రైజింగ్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డి తన ఆరాధ్య క్రికెటర్ పేరు వెల్లడించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఇష్టం ఉన్నా.. ఓ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, బెన్ స్టోక్స్‌లను ఆరాధిస్తానని చెప్పాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టుకు తన పెద్ద అభిమానినని తెలిపాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సంచలన ప్రదర్శన కనబర్చిన నితీష్ కుమార్ రెడ్డి.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా పిలుపును కూడా అందుకున్నాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన నితీష్ కుమార్ రెడ్డి దురదృష్టవశాత్తు గాయంతో ఆఖరి నిమిషంలో జట్టుకు దూరమయ్యాడు.

Not Kohli and Rohit SRH Sensation Nitish Kumar Reddy Names One Indian Cricketer Who Inspires Him

ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియా తరఫున ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అతి త్వరలోనే అతను భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

టీమిండియా మేనేజ్‌మెంట్ సైతం హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా నితీష్ కుమార్ రెడ్డిని సిద్దం చేయాలని భావిస్తోంది. తాజాగా ప్రముఖ క్రికెట్‌వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా, బెన్ స్టోక్స్‌లు తన అభిమాన ఆటగాళ్లని చెప్పుకొచ్చాడు.

'ఐపీఎల్ 2024 అనంతరం హార్దిక్ భాయ్ నాకు మెసేజ్ చేశాడు. మైదానంలో నేను చూపించిన ఇంటెంట్, ఎనర్జీ బాగున్నాయని మెంచకున్నాడు. ఆటను గౌరవిస్తూ ఇలానే ఆడాలని సూచించాడు. అతి త్వరలోనే కలిసి మాట్లాడుకుందామని చెప్పాడు. ఈ మెసేజ్ చూసి నేను షాకయ్యాను. మరీ ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌తో బిజీగా ఉండి కూడా నాకు మెసేజ్ చేయడం సంతోషంగా అనిపించింది.

ఓ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, బెన్ స్టోక్స్‌లను నేను ఆరాధిస్తాను. హార్దిక్ భాయ్ మేసేజ్‌కు నేను ధన్యవాదాలు చెబుతూ బదులిచ్చాను. నాకు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ అంటే చాలా ఇష్టం. గత 10 ఏళ్లుగా నేను ఆర్‌సీబీకి పెద్ద అభిమానిని. ఐపీఎల్ 2023 సందర్భంగా నాకు తొలిసారి విరాట్ కోహ్లీని కలిసే అవకాశం దక్కింది. అప్పుడు కోహ్లీ భాయ్‌ని ఏం అడగాలనిపించలేదు. కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నాను. ఐపీఎల్ 2024లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో బాగా ఆడాలనుకున్నాను.

తద్వారా కోహ్లీ దృష్టిలో పడాలని భావించాను. కానీ ఆ మ్యాచ్‌లో నాకు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో కోహ్లీ భాయ్ నా పేరు చెబుతూ.. నన్ను గుర్తు పట్టారు. అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, July 24, 2024, 18:43 [IST]
Other articles published on Jul 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+