
రాహుల్ ఒక్కడేనా?
అయితే కేఎల్ రాహుల్ కంటే దారుణ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు జట్టులో ఉన్నా వారి గురించి ఎవరూ మాట్లాడటం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌లో గత రెండేళ్లుగా టీమిండియా బ్యాటర్లు చేసిన పరుగులను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని అంటున్నారు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రాహుల్.. సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మరో శతకం బాదాడు. 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 30.28 సగటుతో 636 పరుగులు చేశాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా గణంకాలు రాహుల్ కంటే దారుణంగా ఉన్నాయి. పుజారా 29.81 సగటుతో పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ 26.13 యావరేజ్‌తో రన్స్ చేశాడు.

కోహ్లీ, పుజారా మరీ దారుణం..
కోహ్లీ అత్యధిక స్కోర్ 79 కాగా.. 2019 నుంచి అతను ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 2020 నుంచి ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 993 పరుగులు మాత్రమే చేశాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాదే టెస్ట్ ఫార్మాట్‌లో వరుస అవకాశాలు అందుకున్న అయ్యర్.. 8 మ్యాచ్‌లు 14 ఇన్నింగ్స్‌ల్లో 49.23 యావరేజ్‌తో 640 పరుగులు చేశాడు. అయ్యర్ తర్వాత రోహిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఫిట్‌నెస్ సమస్యలతో చాలా మ్యాచ్‌లకు దూరమైన హిట్ మ్యాన్ 15 మ్యాచ్‌లు, 27 ఇన్నింగ్స్‌ల్లో 47.16 సగటుతో 1179 రన్స్ చేశాడు. ఆ తర్వాత రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్‌లు ఉండగా.. చివరి మూడు స్థానాల్లో రాహుల్, పుజారా, కోహ్లీ ఉన్నారు.

వైట్ బాల్ ఫామ్‌తోనే..
గతేడాది ఆసియాకప్‌తో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ వైట్‌బాల్ క్రికెట్‌లో వరుస సెంచరీలతో జోరు కనబరుస్తున్నాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో వరుసగా సెంచరీలు బాదిన కోహ్లీ.. ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 44 పరుగులు చేసిన విరాట్.. అంపైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. దాంతో కోహ్లీ వైఫల్యం ఎవరికీ పెద్దగా కనిపించడంలేదు. ఇక పుజారా సైతం వరుసగా విఫలమవుతున్నా.. అందరూ రాహుల్‌నే ఫోకస్ చేస్తుండటంతో మనోడు బచాయిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












