Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా, షాహిన్ అఫ్రిది కాదు.. అతనే నా ఫేవరేట్ పేసర్: వెస్టిండీస్ దిగ్గజం

ఈ తరం అత్యుత్తమ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2024లోనూ 15 వికెట్లతో సత్తా చాటిన జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఈ అవార్డు అందుకున్న తొలి బౌలర్‌గా కూడా చరిత్రకెక్కాడు.

ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలోనూ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. బుమ్రా తర్వాత పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిది ఈ తరం అత్యుత్తమ పేసర్‌గా గుర్తింపు పొందాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ ఫేవరేట్ బౌలర్‌గా ఈ ఇద్దరిలో ఒకరి పేరు చెబుతుంటారు.

Not Jasprit Bumrah Or Shaheen Afridi Curtly Ambrose Names Pakistan Veteran As Favourite Fast Bowler

బ్యాటర్ల పేరు చెబుతారు..
తాజాగా వెస్టిండీస్ దిగ్గజం కర్ట్‌లీ ఆంబ్రోస్‌ను ఓ ఇంటర్వ్యూలో ఫేవరేట్ బౌలర్ ఎవరు? అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జస్‌ప్రీత్ బుమ్రా, షాహిన్ ఆఫ్రిది పేరు కాకుండా.. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ పేరు చెప్పారు. అయితే చాలా మంది ఆటగాళ్లు తమ ఫేవరేట్ ప్లేయర్ అనే ప్రశ్నకు బ్యాటర్ల పేర్లే ఎక్కువగా చెబుతారని ఈ దిగ్గజ బౌలర్ చెప్పుకొచ్చాడు.

'ఫేవరేట్ క్రికెటర్లుగా బ్యాటర్ల పేర్లు చెప్పడం విని నేను కొన్నిసార్లు బాధపడ్డాను. నేను సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. చాలా సార్లు ఫేవరేట్ క్రికెటర్ ఎవరా? అనే ప్రశ్నకు బ్యాటర్ల పేర్లే సమాధానాలుగా వినిపించేవి. బ్యాటర్లతో పాటు నేను కూడా కొన్ని గొప్ప మ్యాచ్‌లు ఆడాను. బ్యాటర్లంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఓ మాజీ బౌలర్‌గా నేను మాత్రం బౌలర్ల వైపే ఉంటాను. వసీం అక్రమ్ నా ఫేవరేట్ బౌలర్.

ఆ ముగ్గురికే బౌలింగ్ చేస్తా..
ఈ తరం బ్యాటర్లలో నేను ఎవరికైనా బౌలింగ్ చేయాలంటే.. కోహ్లీ, జోరూట్, స్టీవ్ స్మిత్‌లకు బంతులు వేస్తాను. ఈ తరం అత్యుత్తమ బ్యాటర్లు అయిన ఈ ముగ్గురికి బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడుతాను. కుర్రాళ్లకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలంటే మరింత ఎక్కువగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాలి. రెడ్ బాల్ క్రికెట్ నుంచి టీ20లకు ట్రాన్స్‌ఫామ్ అవ్వడం సులువు.

రెడ్ బాల్ క్రికెట్‌లో సత్తా చాటే ఆటగాళ్లు చాలా మంది టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. అందుకే కుర్రాళ్లను మరింత ఎక్కువగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని చెబుతున్నా. నైపుణ్యాలు, బ్యాట్స్‌మన్‌షిప్, ఇన్నింగ్స్ నిర్మించడం వంటి విషయాలు రెడ్ బాల్ క్రికెట్ ద్వారానే అర్థమవుతాయి.'అని కర్ట్‌లీ ఆంబ్రోస్ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ వన్డేల్లో 502, టెస్ట్‌ల్లో 414 వికెట్లు పడగొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే. వసీం అక్రమ్ సైతం తన ఫేవరేట్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అని తెలిపాడు.

Story first published: Friday, September 6, 2024, 12:48 [IST]
Other articles published on Sep 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+