టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. అత్యుత్తమ టాప్-5 బౌలర్లు, బ్యాటర్ల వివరాలను వెల్లడించాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అత్యుత్తమ పేసర్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ పండిట్స్ కొనియాడుతున్న విషయం తెలిసిందే. కానీ కేఎల్ రాహుల్ మాత్రం బుమ్రాను కాకుండా సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టేయిన్‌ను బెస్ట్ పేసర్‌గా పేర్కొన్నాడు.
తాజాగా ఓ చిట్‌చాట్‌లో డేయిల్ స్టేయిన్ నెంబర్ వన్ బౌలర్‌గా పేర్కొన్న కేఎల్ రాహుల్.. జస్‌ప్రీత్ బుమ్రాకు మూడో ర్యాంక్ ఇచ్చాడు. హోస్ట్ ఒక్కో పేరు అడగ్గా వారికి రాహుల్ ర్యాంకులు ఇచ్చాడు.

ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు రెండో ర్యాంక్ ఇచ్చిన రాహుల్.. రషీద్ ఖాన్, నసీమ్ షాలను టాప్-5 బౌలర్లుగా పేర్కొన్నాడు. ఇదే చిట్‌చాట్‌లో విరాట్ కోహ్లీని అత్యుత్తమ బ్యాటర్‌గా పేర్కొన్న రాహుల్.. రోహిత్ శర్మకు రెండో ర్యాంక్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్‌కు మూడో స్థానం... బాబర్ ఆజామ్, ట్రావిస్ హెడ్‌లకు నాలుగు, ఐదు స్థానాలు కేటాయించాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్ట్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కింది. నిలకడలేమి ఫామ్‌తో బాధపడుతున్న రాహుల్.. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా బీ తరఫున హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ ప్రదర్శనతో అతన్ని సెలెక్టర్లు టీమిండియాకు ఎంపిక చేశారు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ సిరీస్‌లో రాహుల్ సత్తా చాటడం కీలకం. లేకుంటే కుర్రాళ్లు అతని స్థానాన్ని భర్తీ చేస్తారు. తుది జట్టు ఎంపిక విషయంలో కేఎల్ రాహుల్‌కు రిషభ్ పంత్‌తో పోటీ నెలకొంది. కానీ ఇద్దర్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సర్ఫరాజ్ ఖాన్ ఉద్వాసనకు గురవుతాడు.