Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచన మంచిది కాదు: విరాట్ కోహ్లీ

Not in favour of four-day Tests, says India captain Kohli

హైదరాబాద్: టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేందుకు ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్(ఐసీసీ) ప్రతిపాదనపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విముఖత వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచన సరైంది కాదని అన్నాడు.

ఏదో మార్పు చేయాలనే యోచనతో టెస్టు క్రికెట్‌ను నాలుగు రోజులకు కుదించడం మంచిది కాదని కోహ్లీ అన్నాడు. ఆదివారం గువహటి వేదికగా శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీని టెస్టులను నాలుగు రోజులకు కుదించడంపై మీడియా అడిగింది.

కోహ్లీ మాట్లాడుతూ "డే-నైట్‌ టెస్టులో ఏమైనా మార్పు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా మార్చడానికి యత్నిస్తే బాగుంటుంది. డే-నైట్‌ టెస్టు విజయవంతమైన క్రమంలో దానిపై కసరత్తు చేస్తే బాగుంటుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను ఒక రోజుకు తగ్గించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు" అని పేర్కొన్నాడు.

నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ ప్రతిపాదనను ఆసీసీ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ సైతం వ్యతిరేకించాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ముందు వారి ప్రతిపాదన పరిశీలించాలి. అది ఆచరణలోకి వచ్చాక ఆలోచించాలి. ఇప్పుడే దాని గురించే స్పందిస్తే అది తొందరపాటు అవుతుంది" అని అన్నాడు. 2023-2031 షెడ్యూల్‌ నుంచి ఈ మార్పులు చేయనుంది.

నటాషాతో హార్ధిక్ ఎంగేజ్‌మెంట్ మాకు తెలియదు: పాండ్యా తండ్రి హిమాన్షు
మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ సైతం వ్యతిరేకించాడు. "ఇది సరైన నిర్ణయం కాదన్నాడు. తానొక సంప్రదాయ క్రికెటర్‌నని, నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ అనేది సరైనది కాదన్నాడు.ఒకవేళ నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ను ప్రవేశపెడితే దానిని ద్వేషిస్తా" అని తెలిపాడు.

Story first published: Saturday, January 4, 2020, 16:33 [IST]
Other articles published on Jan 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+