Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నటాషాతో హార్ధిక్ ఎంగేజ్‌మెంట్ మాకు తెలియదు: పాండ్యా తండ్రి హిమాన్షు

This Took Us by Surprise: Dad on Hardik Pandyas Engagement to Natasa Stankovic

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా నూతన సంవత్సంర రోజు బాలీవుడ్‌ నటి నటాషా స్టాన్‌కోవిచ్‌‌ని నిశ్చితార్ధం చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే, తన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండానే పాండ్యా ఈ నిశ్చితార్ధం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా చెప్పాడు.

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ముందు మోకాళ్లపై రింగ్ తొడిగాడు. ఆపై నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని హార్దిక్ పాండ్యా తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

హార్ధిక్ పాండ్యా నిశ్చితార్ధంపై తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ "నటాషా మంచి అమ్మాయి. ముంబైలో చాలా సందర్భాల్లో మేం ఆమెను కలిశాం. కొత్త సంవత్సరం సందర్భంగా వారిద్దరూ దుబాయ్‌కి వెళ్తున్నారని మాకు తెలుసు. నిశ్చితార్ధం గురించి మాత్రం అస్సలు తెలియదు" అని చెప్పారు.

"హార్ధిక్ నిశ్చితార్ధం మమ్మల్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. వారిద్దరికీ నిశ్చితార్ధమైన తర్వాతే మాకు తెలిసింది. పెళ్లి ఎప్పుడు జరిపించాలో ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే ముహూర్తం నిర్ణయిస్తాం" అని పాండ్యా తెలిపారు. మరోవైపు హార్ధిక్ సోదరుడు కృనాల్‌ పాండ్యా వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్‌లో "బిగ్ బిగ్‌ కంగ్రాట్స్‌ హార్దిక్‌ పాండ్య, నటాషా. మా క్రేజీ ఫ్యామిలీతో నువ్వు(నటాషా) కలవడం చాలా సంతోషంగా ఉంది. వెల్‌కమ్‌ టు ద మ్యాడ్‌నెస్‌. లవ్‌ బోత్‌ ఆఫ్‌ యూ" అని పేర్కొన్నాడు.

Story first published: Saturday, January 4, 2020, 15:52 [IST]
Other articles published on Jan 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+