Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: బెన్ స్టోక్స్

తొలి రోజు ఆటలోనే క్రిస్ వోక్స్ గాయపడటం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. వోక్స్ గాయపడినా జట్టు కోసం బ్యాటింగ్‌కు దిగడం గొప్ప విషయమని చెప్పాడు. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

339/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. 367 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్(5/104) ఐదు వికెట్లతో భారత్‌కు చిరస్మరణీయమైన వియాజయాన్నందించాడు. సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ(4/126) నాలుగు వికెట్లు తీయగా ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమంగా నిలిచింది. ఇంగ్లండ్ విజయం కోసం గాయంతో బ్యాటింగ్‌కు దిగిన క్రిస్ వోక్స్(0 నాటౌట్‌)‌తో కలిసి గస్ అట్కిన్సన్(17) పోరాడినా ఫలితం లేకపోయింది.

Not Ideal Ben Stokes On Cost of Losing Frontline Bowler in 5th Test Defeat

ఓడినా.. గర్వంగా ఉంది

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్.. ఆఖరి టెస్ట్‌కు దూరమవ్వడం నిరాశకు గురి చేసిందన్నాడు. 'మ్యాచ్ ఆడకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. ఇది మరో అద్భుతమైన పోరాటం. ఈ మ్యాచ్ కూడా ఐదో రోజుల పాటు సాగింది. ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. సాయశక్తులా పోరాడాయి. ఈ మ్యాచ్‌లో మేం గెలవకపోవడం నిరాశకు గురిచేసింది. కానీ ఇంగ్లండ్ ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నాను. ఈ సిరీస్ గెలవకపోవడం కూడా నిరాశకు గురి చేసింది.

గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు దిగడం అద్భుతం. కండిషన్స్ డిమాండ్ చేస్తే బ్యాటింగ్ చేయాలనే ఆలోచనతో క్రిస్ వోక్స్ ఉన్నాడు. నిన్న మొత్తం గాయమైన చేతితో బ్యాటింగ్ ఎలా చేయాలని అతను ఆలోచించాడు. ఇరు జట్లలో విరిగిన చేతులు, కాళ్లతో ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. ఇది వారి దేశం తరఫున ఆడటం వారికి ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. గాయాలతో బ్యాటింగ్ చేయడం పట్ల నేను గర్వపడుతున్నాను. శుభ్‌మన్ గిల్ కూడా గర్వపడుతాడని అనుకుంటున్నా.

అతని గాయం దెబ్బతీసింది..

భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ ఎప్పుడూ పెద్ద సిరీసే. మైదానంలో చాలా భావోద్వేగాలను చూస్తారు. అయితే మైదానంలో చోటు చేసుకున్న ఘటనలపై మేం ఏడుస్తూ కూర్చోం. భారత ఆటగాళ్లు కూడా అంతే. అదంతా ఆటలో భాగమే. మైదానం బయట మేమంతా స్నేహితులమే. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా నా పాత్రను నిర్వర్తించడానికి నేను చాలా కష్టపడ్డాను. ఈ మ్యాచ్ ఆడలేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. రిహాబిలిటేషన్ తీసుకొని యాషెస్ సిరీస్‌కు సిద్దమవ్వాలి.

ఆట ఆరంభంలోనే ఓ బౌలర్ గాయపడితే ప్రణాళికలు మొత్తం మారిపోతాయి. రెండో ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు చూపించిన పోరాటం అద్భుతం. ఆటగాళ్ల నుంచి మేం కోరుకునేది ఒక్కటే.. జట్టు కోసం వారి సర్వస్వం ఇవ్వాలి. మా బౌలర్లలో ఒకరు గాయపడటం మా విజయవకాశాలను దెబ్బతీసింది. అయినా మా ముగ్గురు బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, August 4, 2025, 18:08 [IST]
Other articles published on Aug 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+