Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: శుభ్‌మన్ గిల్, జోరూట్ కాదు.. అతనిదే టాప్ ర్యాంక్!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్.. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను జోరూట్‌ను వెనక్కినెట్టాడు.

యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శుభ్‌మన్ గిల్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో డబుల్ సెంచరీ(269)తో పాటు సెంచరీ(161) సెంచరీ బాదిన గిల్.. 858 రేటింగ్ పాయింట్స్‌తో ఆరో స్థానంలో నిలిచాడు. రిషభ్ పంత్ ఒక స్థానం దిగజారి 8వ ర్యాంక్ అందుకున్నాడు. శుభ్‌‌మన్ గిల్ ఎంట్రీతో టాప్ -10 బ్యాటర్లలో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు.

Not Gill or Root Harry Brook Takes Over as World s Top-Ranked Test Batter

రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన రవీంద్ర జడేజా(89, 69) ఆరు స్థానాలు ఎగబాకి 39వ స్థానంలో నిలవగా.. అజేయశతకంతో రాణించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ జెమీ స్మిత్(184*, 88) 16 స్థానాలు ఎగబాకి తొలి సారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 10వ ర్యాంక్ అందుకున్నాడు. 10 వికెట్లతో చెలరేగిన ఆకాశ్ దీప్ 39 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్ అందుకున్నాడు. ఆకాశ్ దీప్‌కు ఇది కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం గమనార్హం. ఏడు వికెట్లు తీసిన సిరాజ్ 6 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు.

ట్రిపుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్ 34 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో నిలిచాడు. మల్డర్‌కు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం.

Story first published: Wednesday, July 9, 2025, 17:38 [IST]
Other articles published on Jul 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+