Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌతమ్ గంభీర్‌ కాదు.. ఆ క్రెడిట్ రోహిత్ శర్మదే: సునీల్ గవాస్కర్

బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఫలితం కష్టం అనుకున్న కాన్పూర్ టెస్ట్‌లో టీమిండియా ధనాధన్ ఆటతో విజయాన్ని అందుకుంది. టీ20 తరహా బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడింది. వర్షంతో రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. టీమిండియా విజయాన్ని అందుకుంది.

ప్రతీ బ్యాటర్ అటాకింగ్ మోడ్‌లో ఆడటంతో టీమిండియా టెస్ట్ క్రికెట్‌లోనే అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన జట్టుగా రికార్డ్ సాధించింది. టీమిండియా అప్రోచ్‌ను ఉద్దేశిస్తూ కొంతమంది నెటిజన్లు గమ్‌బాల్ అనే పదనాన్ని సృష్టించారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ అప్రోచ్ బజ్‌బాల్ తరహాలో ఈ పదప్రయోగం చేశారు.

Not Gautam Gambhir Sunil Gavaskar credits Rohit Sharma for India s aggressive approach

గమ్‌బాల్ పదం నెట్టింట హల్‌చల్ చేయగా.. అశ్విన్ ఈ పదప్రయోగం బాగుందని, తమది గమ్‌బాల్ ఆటనేనని అంగీకరించాడు. అయితే టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం అది గమ్‌బాల్ కాదని, దూకుడుగా ఆడే క్రెడిట్ రోహిత్ శర్మదేనని స్పష్టం చేశాడు. తాను గోహిట్ అని పిలుస్తానని ఓ దినపత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు.

'టీమిండియా బ్యాటింగ్‌ను ఉద్దేశిస్తూ ఓ పేపర్‌లో బాస్‌బాల్ అని రాసారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేదా జట్టు బాస్ అటాకింగ్ అప్రోచ్ తీసుకొచ్చారనే ఉద్దేశంలో ఈ పేరు పెట్టారు. అయితే గంభీర్ కోచ్ అయిన తర్వాతే జట్టు ఆట తీరు ఇలా మారిందని కొందరూ గమ్‌బాల్ అనే పదాన్ని ప్రమోగించారు.

బెన్ స్టోక్స్, మెక్‌కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ ఆటతీరు మారింది. రోహిత్ శర్మ కూడా కొన్నాళ్లుగా టీమిండియాకు దూకుడు అలవాటు చేశాడు. తాను దూకుడుగా ఆడుతూ.. ఇతర ఆటగాళ్లను ప్రోత్సహించాడు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి కొన్నినెలలు మాత్రమే అవుతోంది. అయితే, కొందరు కోచ్ వల్లే టీమిండియా ఆటతీరు మారిందని గౌతమ్ గంభీర్‌ను హైలైట్ చేస్తున్నారు.

మెక్‌కల్లమ్‌లా గంభీర్ ఎప్పుడూ దూకుడుగా ఆడలేదు. టీమిండియా అటాకింగ్ అప్రోచ్ క్రెడిట్ పూర్తిగా రోహిత్ శర్మదే. కాబట్టి గమ్‌బాల్, బాస్ బాల్ కాకుండా.. గోహిట్ అని పిలుస్తాను.'అని గావస్కర్ రాసుకొచ్చాడు.

Story first published: Monday, October 7, 2024, 17:21 [IST]
Other articles published on Oct 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+