Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నువ్వు రోహిత్‌ను అనేంత మొగోడివా.. టీమిండియా కోచ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్!

టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటేపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ సాధించిన ఘనతల్లో ర్యాన్ టెన్ డస్కాటే కనీసం 5 శాతం కూడా అందుకోలేదని మండిపడ్డాడు. అలాంటి వ్యక్తి రోహిత్ శర్మను కించపర్చేలా మాట్లాడటం సరికాదన్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. రోహిత్ పేలవ ఫామ్‌ గురించి మీడియా ప్రతినిథులు ర్యాన్ టెన్ డస్కాటేను ప్రశ్నించగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో పాటు స్లో పిచ్‌లు కావడంతో ఇబ్బంది పడుతున్నాడని బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్లో వికెట్‌పై రోహిత్ ఆడలేడా? అని ప్రశ్నిస్తున్నారు.

ర్యాన్ టెన్ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన మనోజ్ తివారి.. ఆటగాళ్లు తక్కువ చేసేలా మాట్లాడకూడదని హితవు పలికాడు. 'ర్యాన్ టెన్ డస్కాటే‌పై ఉన్న గౌరవంతో ఆయనకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కేకేఆర్‌ జట్టులో నాలుగేళ్ల పాటు నాకు ఆయన కోచ్‌గా వ్యవహరించాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఆయన రోహిత్ గురించి మాట్లాడేముందు పునరాలోచన చేసుకోవాల్సింది. ఆయన నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. ఆయన అంతర్జాతీయ కెరీర్ గణంకాలు చూస్తే....రోహిత్ శర్మ ఒక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సాధించిన దాంట్లో 5 శాతం కూడా ఉండవు.

Not Even 5 of Rohit s Success Manoj Tiwary Slams India Coach Ryan Ten Doeschate Over Controversial Remarks

రోహిత్ శర్మ టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. అలాంటి ఆటగాడి పట్ల టీమిండి మేనేజ్‌‌మెంట్‌లో భాగంగా ఉన్న వ్యక్తి తక్కువగా మాట్లాడటం సరికాదు. ఆయనేం ఇంట్లో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. జట్టులో భాగంగా ఉన్న తమ ఆటగాడి పట్ల ఇలా మాట్లాడటం సరికాదు. ఆటగాడి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఆయన అలా ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ ఈ వ్యాఖ్యలపై పునరాలోచన చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని నా అభిప్రాయం.'అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 26, 24 పరుగులే చేశాడు. ఈ సిరీస్‌లో పెద్దగా రాణించకపోయినా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ చేసిన రోహిత్... సౌతాఫ్రికాపై 2 హాఫ్ సెచరీలు నమోదు చేశాడు. ఆదివారం జరిగే మూడో వన్డేలో రోహిత్ భారీ ఇన్నింగ్స్‌తో విమర్శకులకు సమాధానం చెప్పాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Saturday, January 17, 2026, 15:42 [IST]
Other articles published on Jan 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+