For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: బ్లాక్ మ్యాజిక్ కాదు.. దూబే వికెట్ వెనుక ఇషాన్ కిషన్ మాస్టర్ మైండ్!(వీడియో)

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం
ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌‌కు హాజరైన ఓ అభిమాని సరదాగా చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎస్‌కే బ్యాటింగ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలో ఉన్న సదరు అభిమాని చేతిలో నిమ్మకాయ పట్టుకొని చేతబడి చేసినట్లుగా ఓ వీడియోను క్రియేట్ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తుండగా.. సదరు అభిమాని నిమ్మకాయతో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్లుగా మంత్రాలు చదివాడు. అతను మంత్రం వేయగానే శివమ్ దూబే యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్‌ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

బ్లాక్ మ్యాజిక్ అంటూ..

ఈ బ్లాక్ మ్యాజిక్ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. మంత్రాలకు చింతకాయలే రాలవు.. వికెట్లు పడతాయా? అని ఒకరంటే.. ఈ చేతబడిపై సీఎస్‌కే బీసీసీఐకి ఫిర్యాదు చేసిందని మరో నెటిజన్ సెటైర్లు పేల్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Not Black Magic How Ishan Kishan Tactical Masterclass Dismissed Shivam Dube in SRH vs CSK Thriller

ఇషాన్ కిషన్ మాస్టర్ మైండ్..

అయితే ఈ వికెట్ వెనుక బ్లాక్ మ్యాజిక్ లేదని, కెప్టెన్ ఇషాన్ కిషన్ మాస్టర్ మైండ్ ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. శివమ్ దూబేకు స్లోయర్ యార్కర్ వేయాలని సాకిబ్ హుస్సేన్‌కు చెప్పిందే ఇషాన్ కిషన్ అని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఈ బంతికి ముందు ఇషాన్ కిషన్ వెళ్లి సాకిబ్ హుస్సేన్‌తో మాట్లాడాడు. ఆ వెంటనే శివమ్ దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

సన్‌రైజర్స్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59), హెన్రీచ్ క్లాసెన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/22), జెమీ ఓవర్టన్(3/37) మూడేసి వికెట్లు తీయగా..ముఖేష్ చౌదరి(2/21) రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్జప్నీత్ సింగ్(1/34) ఒక వికెట్ దక్కింది.

అనంతరం సీఎస్‌కే 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆయుష్ మాత్రే(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30), మాథ్యూ షార్ట్(30 బంతుల్లో 3 ఫోర్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శివమ్ దూబే(16 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(3/29) మూడు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. శివాంగ్ కుమార్(1/18), సాకిబ్ హుస్సేన్(1/32), ప్రఫుల్ హింగే(1/60) చెరో వికెట్ తీసారు.

Story first published: Sunday, April 19, 2026, 18:39 [IST]
Other articles published on Apr 19, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+