Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

120 స్పీడ్‌తో బౌలింగ్.. వాడేం ఆల్‌రౌండర్: కైఫ్

టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే బౌలింగ్ తీరుపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే శివమ్ దూబే ఆల్‌రౌండర్ కాదని, కేవలం బ్యాటర్ మాత్రమేనని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఈ ఘోర పరాజయంతో టీమిండియా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. దర్జాగా సెమీఫైనల్ చేరుతుందనుకున్న టీమిండియా ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు రన్‌రేట్‌పై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. జింబాబ్వేతో గురువారం తమ రెండో సూపర్-8 మ్యాచ్‌కు టీమిండియా సిద్దమైంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. శివమ్ దూబే బౌలింగ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. తుది జట్టులో సంజూ శాంసన్‌ను ఆడించాలన్నాడు. 'సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఫీల్డ్ సెటప్, బ్రెవిస్‌కు వైడ్ యార్కర్స్ వేయాలనే ప్రణాళికను చూస్తుంటే.. శివమ్ దూబే చాలా డిఫెన్సివ్‌గా బౌలింగ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థమైంది. అయితే ఎవడైనా 10వ ఓవర్‌లో డిఫెన్సివ్‌గా బౌలింగ్ చేస్తారా? ఆ సమయంలో ఎవరైనా వికెట్ తీయడానికి అటాకింగ్‌ బౌలింగ్ చేస్తారు.

Not an All-Rounder Mohammed Kaif Slams Shivam Dube s 120kph Pace Ahead of India vs Zimbabwe Clash

నా అభిప్రాయం ప్రకారం శివమ్ దూబే కేవలం బ్యాటర్ మాత్రమే. అతను ఆల్‌రౌండర్ కాదు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఆల్‌రౌండర్ టీమిండియాకు అవసరం లేదు. అతను అప్పుడప్పుడు ఒక వికెట్ తీయవచ్చు కానీ ఎప్పుడూ పరుగులు ఇచ్చుకుంటూనే ఉంటాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కూడా ఇచ్చే ప్రమాదం ఉంది

టీమిండియా కాంబినేషన్‌లో సమతుల్యత లోపించింది. భారత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల విషయంలో హద్దులు దాటి వెళ్తోంది. టాప్ 8 బ్యాటర్లలో ఆరుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో వస్తున్నాడు. అదే మీ విన్నింగ్ ఫార్ములా అని మీరు భావిస్తే.. దానిని దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేయండి. ఆ లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోండి' అని కైఫ్ సూచించాడు.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శివమ్ దూబే 2 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసి 32 పరుగులిచ్చుకున్నాడు. ఈ ఏడాది దూబే 19.57 సగటుతో 7 వికెట్లు తీసాడు. అతని ఎకానమీ రేట్ 10 కంటే ఎక్కువగా ఉంది. బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. బౌలింగ్ అంత గొప్పగా లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కైఫ్ విమర్శలు గుప్పించాడు.

Story first published: Thursday, February 26, 2026, 16:27 [IST]
Other articles published on Feb 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+