Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సో బ్యూటీఫుల్.. సో ఎలెగంట్! SRH ఫ్యాన్స్‌కు నచ్చే వీడియో!

సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు నచ్చే ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎంతగానో అభిమానించే ఆ జట్టు మాజీ కెప్టెన్లు కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ కలిసి తాజాగా బ్యాటింగ్‌ చేశారు. ఈ ఇద్దరూ కలిసి బ్యాటింగ్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు పండుగ చేసుకుంటారని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.

ఈ ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లు ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహిస్తుండగా.. డేవిడ్ వార్నర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో లండన్ స్పిరిట్స్.. ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ కలిసి బ్యాటింగ్‌కు దిగారు. ఈ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది.

Nostalgia for SRH Fans David Warner and Kane Williamson Reunite for London Spirit

సో బ్యూటీఫుల్..

ఈ వీడియోపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సో బ్యూటీఫుల్.. సో ఎలెగంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్'అని కామెంట్ చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుదీర్ఘ కాలం ఆడారు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన డేవిడ్ వార్నర్.. 2021లో ఆ జట్టు వీడాడు. బాల్ టాంపరింగ్ నిషేధంతో వార్నర్ 2018 సీజన్ ఆడలేదు. 2016లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ అందించాడు. వార్నర్ గైర్హాజరీలో జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న కేన్ విలియమ్సన్.. 2018లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

కేన్ మామ, వార్నర్‌కు స్పెషల్ క్రేజ్

ఈ ఇద్దరూ కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చిరస్మరణీయమైన విజయాలు అందించారు. ఈ క్రమంలో తెలుగు ఫ్యాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కేన్ విలియమ్సన్‌కు తెలుగు అభిమానులు.. కేన్ మామ అని పేరు కూడా పెట్టారు. డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోతో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. అయితే ఈ ఇద్దరూ చాలా అవమానకర రీతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వీడటం గమనార్హం. 2021 ఐపీఎల్ సీజన్‌లో తుది జట్టులో చోటు కోల్పోయిన వార్నర్.. వాటర్ బాటిల్స్ కూడా మోసాడు. ఆ తర్వాత అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేయగా.. 2024 వరకు ఢిల్లీకి ఆడాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా నిలవడంతో వార్నర్ ఐపీఎల్ కెరీర్ ముగిసింది.

2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేన్ మామ.. 2022 వరకు ఆ జట్టులో కొనసాగాడు. కెప్టెన్ అయిన కేన్ మామను సన్‌రైజర్స్ ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు వేలంలోకి వదిలేసింది. గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిన అతను ఒకే ఒక్క మ్యాచ్ ఆడి గాయంతో దూరమయ్యాడు. 2024లోనూ రెండు మ్యాచ్‌‌లే ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు. దాంతో అతని ఐపీఎల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది.

లండన్ స్పిరిట్స్ ఓటమి..

ది హండ్రెడ్ లీగ్‌ను కేన్ విలియమ్సన్ సారథ్యంలోని లండన్ స్పిరిట్ ఓటమితో ప్రారంభించింది. నిర్ణీత 100 బంతుల్లో లండన్ స్పిరిట్ టీమ్ 80 పరుగులు చేసింది. కేన్ మామ(9), డేవిడ్ వార్నర్(9) తీవ్రంగా నిరాశపర్చారు. అనంతరం ఓవల్ ఇన్విన్సిబుల్స్ 69 బంతుల్లోనే 81 పరుగులు చేసి గెలుపొందింది.

Story first published: Wednesday, August 6, 2025, 11:05 [IST]
Other articles published on Aug 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+