For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘మా జట్టు ప్రపంచకప్ గెలిస్తేనే పెళ్లి చేసుకుంటా’: బంగ్లాదేశ్ అభిమాని

బంగ్లాదేశ్ క్రికెట్‌ టీమ్ ప్రపంచకప్ గెలిస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒంటరిగానే ఉంటానని ఓ అభిమాని ప్లకార్డ్ ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్.. ఆ జట్టుతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో యూఏఈ గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ బంగ్లాదేశ్ అభిమాని.. తమ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఓ ప్లకార్డ్ ప్రదర్శించాడు.

దానిపై 'బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్ గెలిస్తేనే పెళ్లి చేసుకుంటాను'అని రాసి ఉంది. టీవీ కెమెరాలు అతన్ని చూపించడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బంగ్లాదేశ్ తమ చరిత్రలోనే ఇప్పటి వరకు ఓ ముక్కోణపు సిరీస్ కూడా గెలవలేదు. ఆసియా కప్‌తో సహా ప్రధాని టోర్నీల్లో ఒక్కదాంట్లో విజయం సాధించలేదు. అలాంటి జట్టు ప్రపంచకప్ ఎలా గెలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

No World Cup No Marriage Bangladesh fan s pledge during 2nd T20I vs UAE video

బంగ్లాదేశ్ ప్రపంచకప్ గెలిచే వరకు పెళ్లి చేసుకోనంటే.. జీవితంలో పెళ్లి కాదని హెచ్చరిస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్, 2027 వన్డే ప్రపంచకప్ వరకు వేచి చూసి పెళ్లి చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఈ మ్యాచ్ కామెంటేటర్ కూడా సదరు అభిమానికి ఇదే సలహా ఇచ్చాడు. ఆ అభిమాని దరిద్రమో ఏమో కానీ.. అతను ప్లకార్డ్ ప్రదర్శించిన మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. టీ20 చరిత్రలోనే బంగ్లాదేశ్‌ను యూఏఈ తొలిసారి ఓడించింది.

ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. తాంజిద్ హసన్(59) హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(40), టౌహిడ్ హృదయ్(45) దూకుడుగా ఆడారు. అనంతరం యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. ఆ జట్టు కెప్టెన్ ముహమ్మద్ వసీమ్(42 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82) విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Tuesday, May 20, 2025, 20:33 [IST]
Other articles published on May 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+