
ఏ కారణంతో వేటు వేశాడు:
విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. ఏ కారణంతో శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేశాడో విరాట్ చెప్పాలని వీరూ ప్రశ్నించాడు. సోనీ టీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్ మాట్లాడుతూ... 'శ్రేయాస్ అయ్యర్ చివరిగా ఆడిన టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. న్యూజీలాండ్ గడ్డపై అద్భుతంగా ఆడాడు. జట్టు భారీ స్కోర్ చేయడంలో తనవంతు కృషి చేశాడు. మరి ఏ కారణంతో తొలి టీ20లో అతనిపై విరాట్ కోహ్లీ వేటు వేశాడు?. ఇదే ప్రశ్నని అడిగేందుకు శ్రేయాస్ అయ్యర్‌కి ధైర్యం లేదు. మరెవరికీ కూడా లేదు. ఎందుకంటే అతడు టీమిండియాకు కెప్టెన్' అని అన్నాడు.

కోహ్లీకి రూల్స్ వర్తించవా?:
'2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నెం.4 బ్యాట్స్‌మెన్ గురించి చాలా చర్చ జరిగింది. ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశమివ్వగా అతను వన్డే, టీ20ల్లో నిలకడగా రాణించి ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకొనే పనిలో ఉన్నాడు. కానీ తొలి టీ20లో అయ్యర్‌పై వేటు పడడం వెనుక విరాట్ కోహ్లీ అంతర్యం ఏమిటో అర్థం కాలేదు. కోహ్లి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరికి రూల్స్ అందరికీ వర్తిస్తాయి ఒక్క కోహ్లీకి తప్ప. ఎందుకు అతని విషయంలో మాత్రం నిబంధనల్ని పట్టించుకోరు. కోహ్లీ తనకి నచ్చినట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడు. ఆటగాళ్లపై వేటు వేస్తాడు. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశాలిస్తుంటాడు. ఇలా చేయడం సరికాదు. విరాట్ తన పద్దతిని మార్చుకుంటే బాగుంటుంది' అని సెహ్వాగ్ మండిపడ్డాడు.

నెం.4 విషయంలో సంక్షోభం:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నెం.4 బ్యాట్స్‌మెన్ గురించి టీమిండియాలో అతిగా చర్చ జరిగింది. అప్పటికి కుదురుకుంటున్న అంబటి రాయుడికి చోటివ్వకపోవడం పెద్ద దుమారమే రేపింది. విజయ్ శంకర్‌కు అవకాశం ఇవ్వడంపై సెలెక్టర్లపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి వరుసగా భారత సెలెక్టర్లు అవకాశమివ్వగా.. వన్డే, టీ20ల్లో అతను నిలకడగా రాణించాడు. ఇక తొలి టీ20లో అతనిపై వేటు వేయడం ద్వారా.. మళ్లీ నెం.4 విషయంలో సంక్షోభం తీసుకురాబోతున్నారని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.
India vs Australia: ఆస్ట్రేలియాకు నాలుగో షాక్.. ఈసారి కెప్టెన్ ఔట్!!


Click it and Unblock the Notifications
