Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: ఆస్ట్రేలియాకు నాలుగో షాక్.. ఈసారి కెప్టెన్ ఔట్!!

India vs Australia: Aaron Finch dought for next two T20IS

కాన్‌బెర్రా: శుక్రవారం టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఓడిపోయిన ఆస్ట్రేలియాకి మరో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ మిగతా రెండు మ్యాచులు ఆడడం అనుమానంగా మారింది. ‌ఫించ్‌కి గజ్జలో గాయం కావడంతో.. ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న రెండో టీ20లో అతను ఆడటంపై సందేహం నెలకొంది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే రెండో టీ20లో ఫించ్ ఆడతాడు. ఇక చివరి టీ20కి మూడు రోజుల సమయం ఉండడంతో కోలుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఐపీఎల్ 2020లో తేలిపోయిన అరోన్ ఫించ్.. వన్డే సిరీస్‌లో మాత్రం దుమ్మురేపాడు. సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. ఇక తొలి టీ20 మ్యాచ్‌లోనూ 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆరంభంలోనే టీమిండియాని ఆత్మరక్షణలోకి నెట్టే స్థాయిలో హిట్టింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ ఫించ్ ముందుండి జట్టుని నడిపించాలని కంగారూలు ఆశిస్తున్నారు. అయితే తొలి టీ20లో వికెట్ల మధ్య అసౌకర్యంగా పరుగెత్తుతూ కనిపించిన ఫించ్‌కి స్కాన్ తీయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

ఇప్పటికే ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయంతో టీ20 సిరీస్‌కి దూరమయిన విషయం తెలిసిందే. మార్కస్ స్టాయినిస్, అస్గన్ అగర్‌లకి కూడా గాయమైన విషయం తెలిసిందే. దాంతో మొత్తంగా ఆస్ట్రేలియా జట్టులో గాయపడిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకి చేరింది. మరోవైపు కీలక టెస్ట్ సిరీస్ నేపథ్యంలో స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతిని ఇచ్చిన విషయం తెలిసిందే.

నాథన్ లియోన్‌ను శనివారం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంది. దీంతో తమ స్పిన్ బౌలింగ్‌ను ఆస్ట్రేలియా బలోపేతం చేసింది. ఆస్ట్రేలియా ఎ తరఫున ఆడటానికి జట్టు నుంచి తప్పుకున్న ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ లియోన్‌ను తీసుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. 2018 తర్వాత లియోన్ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. టీ20 దుబాయ్‌లో పాకిస్థాన్‌తో ఆడాడు. మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో గెలిచిన ఆస్ట్రేలియా.. మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం 0-1తో వెనకబడి ఉంది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆదివారం జరిగే రెండో టీ20లో తప్పక గెలవాల్సి ఉంది.

Story first published: Saturday, December 5, 2020, 14:09 [IST]
Other articles published on Dec 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+