Virender Sehwag: టాప్-5 వరల్డ్ బెస్ట్ వన్డే బ్యాటర్స్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన హయాంలో ఆడిన ఆటగాళ్లలో నుంచి టాప్-5 వన్డే బ్యాటర్లను ఎంపిక చేశాడు. ఇందులో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లకు అవకాశం ఇచ్చిన సెహ్వాగ్.. ఇతర జట్ల నుంచి మరో ఇద్దరు ప్లేయర్లను తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
పాక్ బ్యాటర్‌కు చోటు..
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను రెండో అత్యుత్తమ వన్డే ప్లేయర్‌గా పేర్కొన్న సెహ్వాగ్.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్‌ను మూడో అత్యుత్తమ వన్డే బ్యాటర్‌గా ఎంపిక చేశాడు. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను నాలుగో బెస్ట్ బ్యాటర్‌గా ఎంపిక చేసిన సెహ్వాగ్.. వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను ఐదో అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మను పట్టించుకోని సెహ్వాగ్..
ఆశ్చర్యకరమైన విషయం ఏంటేంటే.. వన్డే ఫార్మాట్‌లోనే అత్యధిక డబుల్ సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ పేరును సెహ్వాగ్ విస్మరించాడు. మూడు డుబుల్ సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మను మూడో అత్యుత్తమ బ్యాటర్‌గా పేర్కొనాల్సిందని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గేల్, ఏబీ డివిలియర్స్, ఇంజమామ్ ఉల్ హక్ కంటే రోహిత్ శర్మ ఎంతో మెరుగైన బ్యాటరన్ అని అభిప్రాయపడుతున్నారు.
హేమా హేమి బ్యాటర్లే..
సెహ్వాగ్ ఎంపిక చేసిన టాప్-5 వన్డే బ్యాటర్లకు ఈ ఫార్మాట్‌లో మెరుగైన గణంకాలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 463 వన్డేల్లో 18,426 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ 50 శతకాలతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అఅతను 297 ఇన్నింగ్స్‌ల్లో 13,963 పరుగులు చేశాడు.
ఇంజమామ్ ఉల్ హక్ 378 మ్యాచ్‌ల్లో 11,739 పరుగులు చేయగా..ఏబీ డివిలియర్స్ 50 సగటుతో పాటు 100 ప్లస్ స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. అతను 228 వన్డేల్లో 53.50 సగటు..101.09 స్ట్రైక్‌రేట్‌తో 9577 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 10,480 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 260 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 49.05 సగటుతో 10988 పరుగులు చేశాడు. అయినా అతని పేరును సెహ్వాగ్ ప్రస్తావించకపోవడం అతని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications