T20 World Cup: ఓపెనర్‌గా కోహ్లీ.. ధావన్, శ్రేయస్‌కు షాక్! సునీల్ గవాస్కర్ ప్రపంచకప్ జట్టు ఇదే!!

ముంబై: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యూఏఈకి తరలిపొయిన విషయం తెలిసిందే. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర పోరులు జరగనున్నాయి.
మెగా టోర్నీ కోసం చాలా దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఏ రోజు జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే బీసీసీఐ కంటే ముందే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన తన జట్టును ప్రకటించాడు.

ఓపెనర్‌గా కోహ్లీ
సునీల్ గవాస్కర్ ఆశ్చర్యకరంగా ఓపెనర్ శిఖర్ ధావన్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ని తన టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనర్లుగా ఎంచుకున్నాడు సన్నీ. టీ20ల్లో ఓపెనర్‌గా ఆడుతానని విరాట్ గతంలో చెప్పాడు. అందుకే అతడిని సన్నీ ఎంచుకున్నాడు.
దాంతో పృథ్వి షా, శిఖర్ ధావన్‌లకు నిరాశే ఎదురైంది. జూలైలో శ్రీలంక పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల జట్టుకు ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అక్కడ టీ20ల్లో అతడు విఫలమయ్యాడు. మరోవైపు అయ్యర్ భుజం గాయం కారణంగా ఈ సంవత్సరం మార్చి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.

మూడో స్థానంకు సూర్య
యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు సునీల్ గవాస్కర్ మూడో స్థానం ఇచ్చాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు సన్నీ వరుసగా చోటిచ్చాడు. 'కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్. చాలా అనుభవం ఉన్న ఆటగాడు. ఐపీఎల్‌లో గత కొన్ని సంవత్సరాలుగా రాణిస్తున్నాడు.
అతడు కచ్చితంగా ఒక స్థానానికి అర్హుడు. పైగా ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్' అని కృనాల్ పాండ్యాను ఎందుకు ఎంచుకున్నాడో గవాస్కర్ వివరించాడు. పేస్ బౌలింగ్ విభాగానికి మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడని చెప్పాడు.
అంతపెద్ద ఆటగాడు నాకు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించింది: యువ బ్యాట్స్‌మన్

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చహల్
ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ (ఫిట్‌నెస్ సాధిస్తే), శార్దూల్ ఠాకూర్‌లకు సునీల్ గవాస్కర్ తన జట్టులో చోటిచ్చాడు. దీపక్ చహర్‌ను నాలుగో పేసర్‌గా ఎంచుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యూజ్వేంద్ర చహల్‌ను ఎంచుకున్నాడు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను సన్నీ మర్చిపోయాడు.
అయితే సన్నీ గాయపడిన సుందర్‌కు చోటివ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే.. సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది.

సునీల్ గవాస్కర్ టీ20 జట్టు
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ (ఫిట్‌నెస్ సాధిస్తే), జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చహల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications