Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో విఫలం.. హెడ్ కోచ్‌పై వేటు?

 No new contracts for Mickey Arthur & Co as Pakistan Cricket Board plans

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ జట్టు ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) హెడ్ కోచ్‌ మికీ అర్థర్‌పై వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. లీగ్ దశ నుండే పాక్ ఇంటిదారి పట్టడంతో పాకిస్థాన్ జట్టు, సెలెక్టర్లు, కోచింగ్‌ బృందంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా పాక్‌ క్రికెట్‌ ఆట తీరుపై గుర్రుగా ఉన్నాడు.

అర్థర్‌పై వేటు:

అర్థర్‌పై వేటు:

విమర్శల నేపథ్యంలో పాక్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా కోచ్‌, కెప్టెన్‌ను మార్చాలనే యోచనలో ఉంది. అంతేకాదు ఈ నెల 15తో ముగుస్తున్న పాక్ కోచింగ్‌ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని నిశ్చయించుకుందని సమాచారం. ఇదే నిజమయితే 2016 నుంచి పాక్‌ క్రికెట్‌ జట్టుకు సేవలందిస్తున్న మికీ అర్థర్‌పై కూడా వేటు పడనుంది.

పీసీబీ కఠిన నిర్ణయం:

పీసీబీ కఠిన నిర్ణయం:

అర్థర్‌తో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌, బౌలింగ్‌ కోచ్‌ అజహర్‌ మహ్మద్‌, ఇతర సిబ్బందిని కూడా కొనసాగించకూడదని పీసీబీ కఠిన నిర్ణయం తీసుకుందట. ప్రపంచకప్‌లో పాక్‌ వైపల్యానికి కోచింగ్‌ బృందం పొరపాట్లు కూడా ఉన్నాయని పీసీబీ గట్టిగా నమ్ముతోంది. ఇక కెప్టెన్‌ను మార్చాలనే యోచనలో కూడా ఉందట. కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

'ప్రతి ఓవర్ మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా'

శ్రీలంకకు కోచ్‌గా:

శ్రీలంకకు కోచ్‌గా:

పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో అర్థర్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆర్థర్‌ బోర్డుకు ఓ నివేదిక సమర్పించాడు. కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను మూడు ఫార్మాట్ల నుంచి తొలగించండి అని అందులో పేర్కొన్నాడని సమాచారం తెలుస్తోంది. తన పర్యవేక్షణలో పాక్‌ మంచి ప్రదర్శన చేసింది. మరో రెండేళ్లు తన పదవిని పొడిగించాలని ఆర్థర్‌ కోరాడట. మరోవైపు శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తోంది.

Story first published: Wednesday, August 7, 2019, 17:19 [IST]
Other articles published on Aug 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+