SRH ఆల్‌రౌండర్‌పై వేటు.. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే ఇంగ్లండ్ జట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్.. రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2026 జట్టుతో పాటు శ్రీలంకలో పర్యటించే టీ20, వన్డే జట్లను కూడా ఈసీబీ ప్రకటించింది. యాషెస్ మూడో టెస్ట్‌లో గాయపడిన జోఫ్రా ఆర్చర్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కించుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జోష్ టంగ్‌కు రివార్డ్ దక్కింది. గతంలో ఒక్క వైట్ బాల్ మ్యాచ్ కూడా ఆడని జోష్ టంగ్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు లభించింది.
కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్..
ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టును హ్యారీ బ్రూక్ నడిపించనుండగా.. టామ్ బాంటన్, జోస్ బట్లర్, జాకోబ్ బెతెల్, సామ్ కరణ్, బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ చోటు దక్కించుకున్నారు. 'వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న పరిమిత ఓవర్ల జట్లను ఇంగ్లండ్ పురుషుల సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. అలాగే ఫిబ్రవరి, మార్చిలో భారత్, శ్రీలంక వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో బరిలోకి దిగే ఇంగ్లండ్ ప్రాథమిక జట్టును కూడా ప్రకటించారు.

నాటింగ్‌హామ్‌షైర్ సీమర్ జోష్ టంగ్ తొలిసారిగా టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ససెక్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ శ్రీలంక పర్యటనకు దూరమైనా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో గాయపడిన అతను ప్రస్తుతం ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. డర్హామ్ సీమర్ బ్రైడన్ కార్స్ శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టులో చోటు దక్కించుకున్నాడు.
న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న సర్రే ఆల్‌రౌండర్ విల్ జాక్స్ రీఎంట్రీ ఇచ్చాడు. కెంట్ టాపార్డర్ జాక్ క్రావ్లీ రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ జట్లు జనవరి 18, 2026న శ్రీలంక బయలుదేరుతాయి.'అని ఇంగ్లండ్ తమ ప్రకటనలో పేర్కొంది.
జనవరి 22, 24, 27 తేదీల్లో కొలంబో వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. పల్లెకెలె వేదికగా జనవరి 30, ఫిబ్రవరి 1, 3 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది.
శ్రీలంక టీ20, ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టు:
హ్యారీ బ్రూక్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్ (టీ20 ప్రపంచ కప్‌కు మాత్రమే), టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్ (శ్రీలంక పర్యటనకు మాత్రమే), సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
శ్రీలంక వన్డేల కోసం ఇంగ్లండ్ జట్టు:
హ్యారీ బ్రూక్, రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, జాక్ క్రావ్లీ, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, జో రూట్, ల్యూక్ వుడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications