Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కెప్టెన్‌గా తిలక్ వర్మ.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్!

సౌతాఫ్రికా-ఏ జట్టుతో మూడు అనధికార వన్డేలు ఆడే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో భారత జట్టుకు దూరమవడంతో భారత్-ఏ సారథిగా తెలుగు తేజం తిలక్ వర్మను ఎంపిక చేసింది. బుధవారం తిలక్ వర్మ సారథ్యంలో 15 మంది సభ్యుల గల భారత్-ఏ జట్టు వివరాలను బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 13, 16, 19 తేదీల్లో జరిగే ఈ మూడు అనధికార వన్డేల్లో భారత్-ఏ జట్టును తిలక్ వర్మ నడిపించనున్నాడు.

టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ అనధికార వన్డే సిరీస్ ఆడుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఈ అనధికార సిరీస్‌కు ఎంపికవ్వలేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఈ అనధికార సిరీస్ జరగనుంది. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కోహ్లీ, రోహిత్ బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కానీ సెలెక్టర్లు కుర్రాళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు.

No Kohli Rohit Tilak Varma to Lead India A in ODI Series Against South Africa A

భారత ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు అయిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ హర్షిత్ రాణా‌లు ఈ సిరీస్‌లో చోటు దక్కించుకుంది. వీరితో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్‌లు కూడా ఎంపికయ్యారు. ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, విప్రజ్ నిమ్, ప్రభ్ సిమ్రాన్ వంటి ఐపీఎల్ స్టార్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. డిసెంబర్ 9, 11, 14,17,19 తేదీల్లో ఐదు టీ20 మ్యాచ్‌లు జరగుతాయి. టీ20 సిరీస్ ఆడే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.

భారత్-ఏ జట్టు: తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్.

Story first published: Thursday, November 6, 2025, 11:19 [IST]
Other articles published on Nov 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+