యూఏఈలో ఐపీఎల్ 2020.. కుదించిన ఫార్మాట్‌తో లీగ్!!

ముంబై: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించాలని పట్టుదలగా ఉన్నభారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లీగ్ వేదికపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. భారత్‌లో రాబోయే కొన్ని నెలల్లో మ్యాచ్‌లు జరిపించే సూచనలు కనిపించడం లేకపోవడంతో.. ఐపీఎల్ ఆతిథ్యానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సరైన వేదికగా బీసీసీఐ భావిస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి లీగ్ నిర్వహించే అవకాశం లేనందున.. మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించి 5-6 వారాల్లో పూర్తయ్యేలా ఐపీఎల్ 2020ని నిర్వహించాలని భావిస్తోంది. అయితే అక్టోబరు-నవంబరు నెలల్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ రద్దు చేసిన వెంటనే ఐపీఎల్‌పై బీసీసీఐ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.

తుది నిర్ణయం తీసుకోని బీసీసీఐ:
ఐపీఎల్ 2020 నిర్వహణే ప్రధాన ఎజెండాగా శుక్రవారం సమావేశమైన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది. బీసీసీఐ కార్యదర్శి జై షా ఆధ్వర్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ భేటీలో ఐపీఎల్‌తో పాటు భారత క్రికెట్ జట్టు శిక్షణ శిబిరాలను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. భారత్‌లో కరోనా వైరస్ పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించాల్సి వస్తే.. యూఈఏను వేదికగా ఖరారు చేయాలని ఈ భేటీలో చర్చించినట్టు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం ఐపీఎల్ పాలక మండలి తీసుకోనుందని ఆయన తెలిపారు.

టీమిండియా క్యాంప్‌కు 3 వేదికలు:
ఐపీఎల్ కంటే ముందు టీమిండియా ఆటగాళ్లకు శిక్షణ శిబిరాన్ని దుబాయ్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. కరోనా తీవ్రత కారణంగా బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో శిబిరం ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీంతో దుబాయ్‌తో పాటు భారత్‌లోని ధర్మశాల, అహ్మదాబాద్ నగరాలను ప్రత్యామ్నాయాలుగా శిక్షణ శిబిరాలకు ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే దుబాయ్‌లో ఐపీఎల్ నిర్వహిస్తే శిబిరం అక్కడే ఏర్పాటు చేయడం సరైందని కొందరు అభిప్రాయపడ్డారని సమావేశంలో పాల్గొన్న అధికారి చెప్పాడు.

యూఏఈలో ఐపీఎల్ 2020?:
'ధర్మశాల లేదంటే అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన మొతేరా స్టేడియంలో బయో సెక్యూర్ వాతావరణంలో భారత క్రికెటర్లకు శిబిరాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. ఒకవేళ భారత్‌లో కరోనా కేసులు ఎక్కువైతే, యూఏఈలో శిబిరం ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. భద్రతపరంగా యూఏఈ పూర్తిగా సురక్షితమైన ప్రదేశం కాబట్టి.. అక్కడే ఐపీఎల్ 2020 కూడా నిర్వహించే అవకాశం లేకపోలేదు' అని బోర్డు అధికారి తెలిపారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించిన అనుభవం ఉండటంతో బీసీసీఐ యూఏఈ వైపు చూస్తోంది.

ఐపీఎల్ నిర్వహణకు మేం సిద్ధం:
ఐపీఎల్ లీగ్‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్ స్పోర్ట్స్ సిటీ చీఫ్ సల్మాన్ హనీఫ్ స్పందించాడు. 'ఒకవేళ ఐపీఎల్ 2020ని దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటే.. మేము సిద్ధంగా ఉన్నాం. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని సదుపాయాలు రెడీగా ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఐసీసీ అకాడమీ.. స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. స్టేడియంలో తొమ్మిది పిచ్‌లు ఉన్నాయి. ఒకవేళ తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించినా ఎటువంటి నష్టం ఉండదు. పిచ్ కోసం మ్యాచ్‌లను షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. ఐసీసీ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ కోసం 38 నెట్ వికెట్లు ఉన్నట్లు హనిఫ్ తెలిపారు.
ENGvWI: స్టోక్స్ సూపర్ షో.. ఇంగ్లండ్ 469/9 డిక్లేర్డ్.. వెస్టిండీస్ 32/1
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications