న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొండిచేయి: గేల్ ఒకటి తలిస్తే.. విండిస్ బోర్డు మరోకటి తలచింది

India vs West Indies 2019 : No Sentimental Inclusion For Chris Gayle In Windies Test Squad
No Chris Gayle for West Indies in Test series vs India

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్ గేల్ వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. అయితే, తన నిర్ణయాన్ని మార్చుకుని స్వదేశంలో భారత్‌తో టెస్టు సిరీసే తనకు చివరదని వెల్లడించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్ గేల్... చివరగా 2014 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు.

సొంత మైదానంలో టీమిండియాతో జరగబోయే రెండో టెస్టు సిరిసే తనకు ఆఖరిదంటూ స్పష్టం చేశాడు. అప్పట్లో 'నువ్వు టెస్టు క్రికెట్‌కు అసలు సరిపోవు' అంటూ ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం ఆంబ్రోస్‌ మండిపడ్డాడు. అయితే, తాజాగా శుక్రవారం విండీస్‌ బోర్డు అతడి ఆశలపై నీళ్లు చల్లింది. శనివారం 13 మంది కూడిన టెస్టు జట్టును ప్రకటించిన విండీస్‌ సెలక్టర్లు.. క్రిస్ గేల్‌కు చోటివ్వలేదు.

<strong>ఆఖరి బంతికి సిక్స్: 55 బంతుల్లో సెంచరీ, టీ20 బ్లాస్ట్‌లో బాబర్ అజాం రికార్డు</strong>ఆఖరి బంతికి సిక్స్: 55 బంతుల్లో సెంచరీ, టీ20 బ్లాస్ట్‌లో బాబర్ అజాం రికార్డు

కొత్త వారికి అవకాశం

కొత్త వారికి అవకాశం

సెలక్టర్లు కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండిస్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌ను 2-1తో ఓడించిన జట్టునే విండీస్‌ బోర్డు ఎంపిక చేసింది. గాయం కారణంగా అల్జారీ జోసెఫ్‌, జామెల్‌ వారికన్‌ను పక్కన పెట్టిన వెస్టిండిస్ సెలక్టర్లు టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న ఆఫ్‌ స్పిన్నర్‌ రకీం కార్న్‌వాల్‌కి అవకాశం కల్పించారు.

టెస్టుల్లో 15 సెంచరీలతో 7214 పరుగులు

టెస్టుల్లో 15 సెంచరీలతో 7214 పరుగులు

ఇక, క్రిస్ గేల్ విండిస్ తరుపున మొత్తం 103 టెస్టులు, 298 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 333 పరుగుల అత్యధిక స్కోర్‌ సాధించగా 15 సెంచరీలతో 7214 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, 1999 సెప్టెంబర్‌ 11న టీమిండియాతో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన క్రిస్‌ గేల్‌ 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టీమిండియాతోనే ఆఖరి మ్యాచ్‌ ఆడనున్నాడు.

విలియమ్సన్ బర్త్ డే‌ని వినూత్నంగా జరిపిన లంక అభిమానులు (వీడియో)

మరో 9 పరుగులు చేస్తే

మరో 9 పరుగులు చేస్తే

ఆదివారం జరిగే రెండో వన్డేలో గేల్‌ మరో 9 పరుగులు చేస్తే వెస్టిండిస్ తరఫున 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం బ్రియాన్‌ లారా 10405 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌లోనే క్రిస్ గేల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉంది.

టీమిండియాతో వెస్టిండీస్‌ టెస్టు జట్టు ఇదే

టీమిండియాతో వెస్టిండీస్‌ టెస్టు జట్టు ఇదే

జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, డారెన్‌ బ్రేవో, షమరాహ్‌ బ్రూక్స్‌, జాన్‌ క్యాంపబెల్‌, రోస్టన్‌ ఛేజ్‌, రకీమ్‌ కొర్నవాల్‌, డొవ్రిచ్‌, గాబ్రియెల్‌, షిమ్రాన్ హెట్‌మెయిర్

Story first published: Saturday, August 10, 2019, 14:49 [IST]
Other articles published on Aug 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X