విలియమ్సన్ బర్త్ డేని వినూత్నంగా జరిపిన లంక అభిమానులు (వీడియో)

హైదరాబాద్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పుట్టినరోజుని శ్రీలంక అభిమానులు వినూత్నంగా జరిపారు. కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ పర్యనటలో భాగంగా న్యూజిలాండ్ జట్టు రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది.
ఆగస్టు 14న గాలే వేదికగా తొలి టెస్టు
ఆగస్టు 14న గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే, గురువారం నుంచి శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్ XI జట్టుతో న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. మరోవైపు గురువారం కేన్ విలియమ్సన్ 29వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. అయితే, వార్మప్ మ్యాచ్‌ని తిలకించేందుకు వచ్చిన అభిమానులు అతడికి కేక్ తినిపించారు.
మ్యాచ్ విరామ సమయంలో
మ్యాచ్ విరామ సమయంలో కేన్ విలియమ్సన్ అభిమానుల వద్దకు వెళ్లి కరచాలనం చేసి సరదాగా గడిపాడు. అదే సమయంలో కొందరు అభిమానులు కేక్ తీసుకొచ్చి అతడికి తినిపించారు. అభిమానుల ప్రేమకు సంతోషం వ్యక్తం చేసిన విలియమ్సన్ అనంతరం మైదానంలోకి వెళ్లి ఆటను కొనసాగించాడు.
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, తొలి రోజు బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్ XI జట్టు ఆరు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. గుణతిలక(98), సమరవిక్రమ(80), ప్రియంజన్(56) హాఫ్ సెంచరీలు సాధించారు.
ఆగస్టు 22 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాస్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టుకు కొలంబో ఆతిథ్యమివ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications