టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, న్యూజిలాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది గూగుల్ ట్రెండింగ్‌లో నిలిచిన టాప్ ప్లేయర్లుగా గుర్తింపు పొందారు. మరో 19 రోజుల్లో ఈ 2023 ముగియనుండగా.. ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన టాప్ వివరాలను గూగుల్ ప్రకటించింది.
ఈ జాబితాలో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ల జాబితాలో శుభ్‌మన్ గిల్, రచిన్ రవీంద్ర అగ్రస్థానంలో నిలిచారు. వన్డే ప్రపంచకప్‌తో పాటు ఈ ఏడాది ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఈ ఇద్దరితో పాటు మహమ్మద్ షమీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్, ట్రావిస్ హెడ్‌ల పేర్లను కూడా నెటిజన్లు బాగానే సెర్చ్ చేశారు.

మొత్తం 10 టోర్నీల గురించి భారత నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. అంతేకాకుండా క్రికెట్‌లో అత్యధికంగా భారత నెటిజన్లు సెర్చ్ చేసిన 10 మ్యాచ్‌ల వివరాలను కూడా గూగుల్ వెల్లడించింది.
గూగుల్ రిలీజ్ చేసిన టాప్ 10 స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. వన్డే ప్రపంచకప్ 2023 కంటే ఐపీఎల్‌కే ఎక్కువ క్రేజ్ ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది. వన్డే ప్రపంచకప్ కంటే ఐపీఎల్ 2023 ట్యాగ్‌నే నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్ టోర్నీలు కూడా చోటు దక్కించుకున్నాయి.
గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్-10 మ్యాచ్‌ల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ రెండో స్థానంలో ఉండగా.. భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన ఆసియాకప్ ఫైనల్ మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా టాప్-10లో నిలిచింది.

ఈ ఏడాది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ 6 క్రికెటర్లు:
శుభ్‌మన్ గిల్
రచిన్ రవీంద్ర
మహమ్మద్ షమీ
గ్లేన్ మ్యాక్స్‌వెల్,
సూర్యకుమార్ యాదవ్
ట్రావిస్ హెడ్
ఈ ఏడాది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ 10 ఈవెంట్స్:
1. ఇండియన్ ప్రీమియర్ లీగ్
2. క్రికెట్ వరల్డ్ కప్
3. ఆసియా కప్
4. వుమెన్స్ ప్రీమియర్ లీగ్
5. ఏషియన్ గేమ్స్
6. ఇండియన్ సూపర్ లీగ్
7. పాకిస్థాన్ సూపర్ లీగ్
8. ది యాషెస్
9. మహిళల క్రికెట్ వరల్డ్ కప్
10. ఎస్‌ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్)
ఈ ఏడాది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ 10 మ్యాచ్‌లు:
1. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (వన్డే ప్రపంచకప్ ఫైనల్)
2. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్)
3. ఇండియా వర్సెస్ శ్రీలంక (ఆసియా కప్ 2023 ఫైనల్)
4.ఇండియా వర్సెస్ ఇంగ్లండ్
5.ఇండియా వర్సెస్ ఐర్లాండ్
6. ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా
7. ఇండియా vs అఫ్గానిస్థాన్
8) ఇండియా vs బంగ్లాదేశ్
9) గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్(ఐపీఎల్ 2023 ఫైనల్)
10)పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్