Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రైనాకు మోదీ లేఖ.. స్పందించిన చెన్నై ఆటగాడు!!

No Better Appreciation: Suresh Raina response After PM Narendra Modis Letter

న్యూఢిల్లీ: ఆగస్టు 15న టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇచ్చి యావత్‌ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేశాడు. వీడ్కోలుపై ప్రతీఒక్కరూ మాట్లాడుతూ.. రైనా టీమిండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాలను గుర్తుచేసుకునున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పాటు సురేశ్‌ రైనాకు కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఓ సుదీర్ఘ లేఖ రాశారు.

ఇంకా ఆడే సత్తా ఉంది:

ఇంకా ఆడే సత్తా ఉంది:

ప్రధాని నరేంద్ర మోదీ రెండు పేజీల లేఖలో సురేశ్‌ రైనాను ప్రశంసిస్తూ ఇలా రాసుకొచ్చారు. 'సురేశ్‌ రైనా.. ఆగస్టు 15న మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ దానిని నేను రిటైర్మెంట్‌ అనే పదంతో పిలవలేను. ఎందుకంటే.. ఇంకా మీకు ఆడే సత్తా ఉంది. ఎంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ప్లేయర్‌గా కనిపించే మీరు ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలుకుతారని ఊహించలేదు. బ్యాట్స్‌మన్‌ గానే కాకుండా బౌలర్‌గానూ మీ సారథికి ఉపయోగపడ్డారు. మీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ సజావుగా సాగాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని మోదీ లేఖలో పేర్కొన్నారు.

 ఆ రోజు మీ ప్రదర్శనను చూశా:

ఆ రోజు మీ ప్రదర్శనను చూశా:

'రైనా.. మీరు ఇంతకాలం భారత క్రికెట్‌కు అద్భుతమైన సేవలందించారు. ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 28 ఏళ్ల సంవత్సరాల తర్వాత గెలిచిన వన్డే ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. 2011 ప్రపంచకప్‌లో మొతేరా మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మీ ప్రదర్శన (34)ను చూశాను. ఆరోజు మీరు ఆడిన ఇన్నింగ్స్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. చురుకైన ఫీల్డింగ్ విన్యాసాలతో ఎన్నో పరుగులు జట్టుకు సేవ్ చేశారు. జట్టుకు మీలాంటి మంచి ఫీల్డర్‌ అవసరం ఎంతో ఉంది. మీ వీడ్కోలుతో భారత్‌ జట్టు దానిని మిస్సవుతుంది. మీరు ఎందరికో ఆదర్శం. మీరు ఏం చేసినా.. అది దేశానికి ఎంతో దోహదపడింది. థ్యాంక్యూ సురేశ్‌ రైనా' అంటూ మోదీ లేఖలో చెప్పుకొచ్చారు.

థ్యాంక్యూ నరేంద్ర మోదీజీ :

ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖపై సురేష్ రైనా ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 'దేశం తరపున ఆడేటప్పుడు విజయం కోసం రక్తం, చెమటను చిందిస్తాం. దేశ ప్రధానితో పాటు, ప్రజలు మా ప్రదర్శనను గుర్తించి మెచ్చుకోవడం కంటే గొప్ప విషయం ఏది లేదు. ప్రజలు ప్రేమించడం కంటే మంచి ప్రశంసలు లేవు. మీరిచ్చిన సందేశాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తున్నా. థ్యాంక్యూ నరేంద్ర మోదీజీ. జైహింద్‌' అంటూ రైనా ట్వీట్ చేశాడు.

మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు:

మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు:

దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన సురేష్ రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా.. టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా పేరుపై రికార్డు ఉంది. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా.. తన కెరీర్‌ మొత్తంలో 167 క్యాచ్‌లు అందుకున్నాడు.

CPL 2020: బౌండరీలతో చెలరేగిన సునీల్ నరైన్.. ట్రిన్‌బాగో అద్భుత విజయం!

Story first published: Friday, August 21, 2020, 12:45 [IST]
Other articles published on Aug 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+