వెటరన్ తెలుగు హీరో నరేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన హాస్య చిత్రం జంబలకిడి పంబ గురించి అందరికి తెలిసిందే. మహిళలు.. పురుషులుగా.. అబ్బాయిలు.. అమ్మాయిలుగా మారితే ఎలా? ఉంటుందనే కాన్సెప్ట్‌తో దిగ్గజ డైరెక్టర్ ఈవీవీ సత్యనారయణ తెరకెక్కించిన చిత్రం అప్పట్లో బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పటికీ టీవీ ఛానెల్స్‌లో ఈ సినిమా వస్తే కదలకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అంతలా నవ్వించింది ఈ చిత్రం.
టీమిండియాలో జంబలకిడి పంబ
ఈ జంబలకిడి పంబ కాన్సెప్ట్‌ను టీమిండియా క్రికెటర్లకు వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? అని ఓ నెటిజన్ భావించాడు. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయంతో భారత స్టార్ ఆటగాళ్లను మహిళలుగా మార్చేశాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీతో పాటు కేఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా, మహమ్మద్ షమీలను అమ్మాయిలుగా మార్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కత్తిలా ఉన్నారు..
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'రేయ్ ఏందిరా ఇది.. స్టార్ క్రికెటర్లను కత్తిలాంటి ఫీగర్లుగా మార్చేశారు'అని కామెంట్ చేస్తున్నారు. ఇది టీమిండియా జంబలకిడి పంబ అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ల సతీమణుల కంటే వీరే అందంగా ఉన్నారని, బాలీవుడ్ హీరోయిన్లు కూడా పనికిరారని కామెంట్ చేస్తున్నారు. సచిన్, కోహ్లీ, రాహుల్, ధోనీ, యువరాజ్ సింగ్‌లు అమ్మాయిలుగా చాలా హాట్‌గా ఉన్నారని, హార్దిక్ పాండ్యా వెస్టిండీస్ అమ్మాయిని తలపిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.
నీ క్రియేటివిటికి సలామ్ రా అబ్బాయ్!
ఈ వీడియో చూస్తే తమకు నవ్వు ఆగడం లేదని, ఈ క్రియేటివిటికి సలామ్ చేయాల్సిందేనని పోస్ట్‌లు పెడుతున్నారు. ఏఐ టెక్నాలజీని కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేస్తున్న విషయం తెలిసిందే. ఫేక్ డీప్ వీడియోలతో సెలెబ్రెటీల పరువును బజారున పడేస్తున్నారు. అంతేకాకుండా ఫేక్ ప్రచార వీడియోలతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. టెక్నాలజీ ఇలా ఫన్నీగా వాడుకోవచ్చని, అది కూడా హద్దులు ధాటకుండా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వీడియోలో ఏ ఆటగాడు.. అమ్మాయిగా అందంగా ఉన్నారో కామెంట్ చేయండి.
దుబాయ్‌కి టీమిండియా..
ప్రస్తుతం టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సన్నదమవుతోంది. ఈ టోర్నీ కోసం నేడే దుబాయ్ ఫ్లైట్ ఎక్కనుంది. ఫిబ్రవరి 19న ఈ టోర్నీకి తెరలేవనుండగా.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. 23న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.