Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: నా మొగుడు మీకు ఊడిగం చేశాడు.. కేకేఆర్‌పై స్టార్ క్రికెటర్ సతీమణి ఫైర్!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ నితీష్ రాణా‌ను కేకేఆర్ కొనుగోలు చేయలేదు. కనీసం అతని కోసం బిడ్ కూడా వేయలేదు. దాంతో ఆ జట్టుతో నితీష్ రాణాకు ఉన్న ఏడేళ్ల బంధానికి తెరపడింది.

రాజస్థాన్ రాయల్స్‌ నితీష్ రాణాను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. నితీష్ రాణా కోసం రాజస్థాన్ రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ కూడా పోటీపడ్డాయి. కానీ కేకేఆర్ మాత్రం ఆసక్తి చూపించలేదు. ఇదే అతని సతమణి సాచి మార్వాకు కోపం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా కేకేఆర్ జట్టుపై మండిపడింది. తన భర్త కేకేఆర్ కోసం ఎంతో చేశాడని అర్థం వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ రోజుల్లో ఎవరికీ నియత్ లేదని మండిపడింది.

Nitish Rana s wife criticises KKR for not buying the batter at the IPL 2025 mega auction

'విధేయత చాలా ఖరీదైనది, ప్రతి ఒక్కరూ దానిని భరించలేరు'అని ఎక్స్‌వేదికగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ కేకేఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. నితీష్ రాణా కేకేఆర్ కోసం ఊడిగం చేశాడని, వేలంలో అతన్ని పట్టించుకోకపోవడం అన్యాయమని మండిపడుతున్నారు. జట్టు ఏది చెబితే అది చేశాడని, కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడని, వద్దంటే తప్పుకున్నాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

వెంకటేశ్ అయ్యర్ కోసం రూ. 23.75 కోట్లు ఖర్చు చేసిన కేకేఆర్.. నితీష్ రాణా కోసం రూ. 4 కోట్లు వెచ్చించ లేకపోయింది. 2018లో రూ. 3.40 కోట్లకు నితీష్ రాణా కేకేఆర్‌లో జాయినవ్వగా.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ. 8 కోట్లకు అతన్ని రిటైన్ చేసుకుంది.

ఇప్పటి వరకు 88 మ్యాచ్‌లు ఆడిన నితీష్ రాణా 136.32 స్ట్రైక్‌రేట్‌తో 2199 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. తాజా వేలంలో అతన్ని కొనుగోలు చేయకపోవడంతో ఆ జట్టు ఇన్‌స్టాగ్రామ్ పేజీని నితీష్ రాణాతో పాటు అతని సతీమణి సాచి మార్వా అన్‌ఫాలో చేశారు. నితీష్ రాణా మాత్రం పింక్ జెర్సీలోని ఫొటో షేర్ చేస్తూ.. రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు.

కేకేఆర్ పూర్తి జట్టు 2025:
అంగ్‌క్రిష్ రఘువంశీ, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, లువ్‌నిత్ సిసోడియా, అజింక్యా రహానే, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, ఉమ్రాన్ మాలిక్, రింకు సింగ్, వరుణ్ చకరవర్తి, సునీల్ సింగ్‌నా రసీన్, హర్రీషిత్ నరైన్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నోర్ట్జే.

Story first published: Tuesday, November 26, 2024, 14:56 [IST]
Other articles published on Nov 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+