కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ సారథి శిఖర్ ధావన్ తెలిపాడు. 'పిచ్ కాస్త డ్రైగా ఉంది. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచితే కాపాడుకోగలం. ప్రతీ మ్యాచ్‌లో మేం 200 పరుగులు చేయడం మంచి విషయం. జట్టులో ఒక మార్పు చేశాం. షార్ట్ స్థానంలో భానుక రాజపక్స జట్టులోకి వచ్చాడు. ఈ పిచ్‌పై బంతి కాస్త ఆగి వచ్చే అవకాశం ఉంది.'అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా అన్నాడు. 'వికెట్ చాలా పొడిగా ఉంది. ఎలాంటి మార్పులు లేకుండా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. సెకండ్ ఇన్నింగ్స్‌లో మా స్పిన్నర్లకు అడ్వాంటేజ్ లభిస్తుందని ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నా. 'అని రాణా చెప్పుకొచ్చాడు.

ఇక మైదానంలో ఓవైపు బౌండరీ చిన్నగా ఉందని, లెఫ్టాండర్స్‌కు పండుగేనని హోస్ట్ అనగా.. రాణా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'అయ్యా.. లెఫ్ట్ హ్యాండర్స్‌కే కాదు. రైట్ హ్యాండర్స్‌కు కూడా చిన్న బౌండరే. కుడిచేతి బ్యాటర్లు కూడా చిన్న బౌండరీ వైపు ఆడవచ్చు.'అని చమత్కరించాడు.
తుది జట్లు:
కేకేఆర్: రెహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తీ
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కరణ్, షారూఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్