Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నైతో మ్యాచ్‌: నితీష్ రాణా అనుమానమే!

Nitish Rana down with back spasm, skips training

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్ నితీశ్‌ రాణా వెన్నునొప్పి కారణంగా బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో గురువారం జరిగే మ్యాచ్‌కు నితీష్ రాణా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది.

అయితే దీనిపై ఆ జట్టు యాజమాన్యం స్పష్టమైన ప్రకటన ఏమీ చేయలేదు. ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరుపున రాణిస్తున్న ఆటగాళ్లలో నితీష్ రాణా ఒకడు. అద్భుత ప్రదర్శనలతో ఈ సీజన్‌లో రెండు సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు కైవసం చేసుకున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

అంతేకాదు జట్టు మిడిలార్డర్‌లో కోల్‌కతాకు కీలకంగా మారాడు. బెంగళూరులో ఏప్రిల్‌ 29న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన రాణా వెన్నునొప్పితో ఆట మధ్యలోనే మైదానం వీడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన రాణా 31.33 యావరేజితో 188 పరుగులు సాధించాడు.

ఒకవేళ రాణా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడకపోతే ప్రస్తుతం 7వ స్థానంలో ఆడుతున్న శుభ్‌మాన్‌ గిల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావచ్చు. రాణా స్థానంలో తుది జట్టులో ఇషాంక్‌ జగ్గీ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆప్షనల్ ట్రైనింగ్‌లో ధోని, హర్భజన్‌ సింగ్‌ పాల్గొనలేదు.

సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా, లుంగి ఎంగిడి, డుప్లెసిస్‌ మాత్రం ప్రాక్టీస్ మధ్యలో వచ్చి జట్టులోని ఆటగాళ్లతో జత కలిశారు. 12 పాయింట్లతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 8 పాయింట్లతో కోల్‌కతా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్‌కి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోంది.

Story first published: Thursday, May 3, 2018, 11:08 [IST]
Other articles published on May 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+