ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్‌లో టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసాడు. అతని ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(23), జాక్ క్రాలీ(18) నిరాశగా పెవిలియన్ చేరారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత పేసర్లను ఓపెనర్లు ఆచితూచి ఆడారు. ఓవైపు జస్‌ప్రీత్ బుమ్రా, మరోవైపు సిరాజ్.. మధ్యలో ఆకాష్ దీప్ నిప్పులు చెరగగా.. జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఓపికగా బ్యాటంగ్ చేశారు. తమ శైలికి భిన్నంగా ఆడి భారత బౌలర్లను గౌరవించారు. కానీ ఔటాఫ్ సిలబస్‌లా దూసుకొచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సంచలన బౌలింగ్‌తో ఇద్దర్నీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

నితీష్ కుమార్ రెడ్డి వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని బౌండరీ బాది జోరు కనబర్చిన డకెట్ మరుసటి బంతికే ఔటయ్యాడు. నితీష్ లెగ్ సైడ్ బాల్ వేయగా.. డకెట్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి అతని గ్లోవ్స్‌ను తాకుతూ కీపర్ వైపు దూసుకెళ్లగా.. పంత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ ఓవర్ ఆఖరి బంతిని నితీష్.. ఆఫ్ ద పిచ్‌గా వేయగా జాక్ క్రాలీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే నితీష్ రెండు వికెట్లు తీసి భారత్‌కు శుభారంభం అందించాడు. నితీష్ బౌలింగ్‌కు రిషభ్ పంత్ ఆశ్చర్యపోయాడు. రెండో వికెట్ అనంతరం నమ్మలేకపోతున్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు వికెట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సిరాజ్, బుమ్రా, ఆకాశ్ దీప్‌లను ఆచితూచి ఆడిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. ఔటాఫ్ సిలబస్‌లా వచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి చేతులెత్తేసారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్(10 బ్యాటింగ్), జో రూట్(24 బ్యాటింగ్) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.