For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాజల్.. నా ఫేవరేట్ హీరోయిన్: టీమిండియా ఆల్‌రౌండర్(వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తన ఫేవరేట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని తెలిపాడు. తాజాగా పాన్ ఇండియా మూవీ ఛాంపియన్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ రెడ్డి.. ఈ విషయాన్ని వెల్లడించాడు. ఛాంపియన్ హీరో రోషన్‌తో నితీష్ కుమార్ రెడ్డి సరదాగా చిట్ చాట్ చేశాడు.

ఈ మూవీకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత ఇష్టాల గురించి మాట్లాడుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఛాంపియన్ రిలీజ్ అవుతుందని రోషన్ చెప్పగా.. తప్పకుండా చూస్తానని నితీష్ తెలిపాడు. ఈ ఇద్దరు స్నేహితుల్లా చాలా సరదాగా చిట్ చాట్ చేశారు.

Nitish Kumar Reddy Reveals Kajal as His Favourite Actress During Champions Interview

నితీష్: నీ జీవితంలో రియల్ ఛాంపియన్ ఎవరు?

రోషన్‌: నా ఛాంపియన్స్ మా తల్లిదండ్రులు శ్రీకాంత్, ఊహ. నీ రియల్ ఛాంపియన్ ఎవరు?

నితీష్: ఇంకెవరు మా నాన్న ముత్యాల రెడ్డి. ఆయన నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నేను ఈ స్థాయికి చేరడానికి ఆయనే ప్రధాన కారణం కాబట్టి నా ఛాంపియన్ మా నాన్నే. నీ ఫేవరేట్ ఐపీఎల్ క్రికెటర్ ఎవరు?

రోషన్‌: మహేంద్ర సింగ్ ధోనీ.

నితీష్: స్టాండ్స్‌లో నుంచి కూర్చొని ధోనీ ఫీల్డింగ్ సెట్ చేయడం చూడటం నాకు చాలా ఇష్టం. హైదరాబాద్‌ వ్యక్తివే అయినా నువ్వు సీఎస్‌కేకు సపోర్ట్ చేస్తావని నాకు తెలుసు.

రోషన్‌: అవును.. ధోనీ కోసమే సీఎస్‌కేకు సపోర్ట్ చేస్తున్నా.

నితీష్: నా ఫేవరేట్ హీరో మహేష్ బాబు. నీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు?

రోషన్‌: అది చెప్పకూడదు.

నితీష్: ఫేవరేట్ హీరోయిన్ ఎవరు?

రోషన్‌: నాకు సమంత అంటే ఇష్టం. నీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు?

నితీష్: నా ఫేవరేట్ హీరోయిన కాజల్ అగర్వాల్. నా టీమ్ మొత్తాన్ని ఛాంపియన్ సినిమాకు తీసుకెళ్తాను.

రోషన్‌: థ్యాంక్యూ.

రోషన్ అనస్వర రాజన్ జంటగా ప్రదీప్ అద్వైతం రూపొందించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్'. జీ స్టూడియోస్ సమర్పణలో స్పప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి. ఇప్పటికీ ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

కెప్టెన్‌గా నితీష్ రెడ్డి..

విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా నితీష్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. బెంగళూరు వేదికగా ఢిల్లీతో ఆంధ్ర టీమ్ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఢిల్లీ తరఫున కోహ్లీతో పాటు రిషభ్ పంత్ బరిలోకి దిగాడు.

Story first published: Wednesday, December 24, 2025, 12:11 [IST]
Other articles published on Dec 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+