Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: టెస్ట్ టీమ్‌లోకి తెలుగోడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడే భారత జట్టు ఇదే!

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌తో పాటు నాలుగు టీ20ల సిరీస్ కోసం సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 19 మంది, 16 మంది సభ్యులతో కూడిన వేర్వేరు జట్ల వివరాలను భారత సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. తెలుగు తేజం, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చోటు దక్కింది. అతనికి టీమిండియా టెస్ట్ టీమ్ పిలుపు అందడం ఇదే తొలిసారి.

ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో టెస్ట్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి భారత్-ఏ జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్‌‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.

Nitish Kumar Reddy get a chance as BCCI announced Indian Squad for the Border-Gavaskar Trophy

ప్రసిధ్ కృష్ణ రీఎంట్రీ ఇవ్వగా.. హర్షిత్ రాణా‌ తొలిసారి టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆటగాళ్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మినహా మిగతా ఆటగాళ్లంతా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అనూహ్యంగా భారత టెస్ట్ టీమ్‌లోకి తీసుకున్న వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో కొనసాగించారు.

గజ్జలో గాయంతో కుల్దీప్ యాదవ్ ఈ పర్యటనకు దూరమైనట్లు బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ముఖేష్ కుమార్, నవ్‌దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసింది. నవంబర్ 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 3 వరకు ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీ20 టీమ్‌ను ఎంపిక చేయగా.. తిలక్ వర్మకు అవకాశం దక్కింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు ఎంపికయ్యారు. నవంబర్ 8 నుంచి 15 వరకు ఈ సిరీస్ జరగనుంది.

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్

Story first published: Friday, October 25, 2024, 22:53 [IST]
Other articles published on Oct 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+