Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శతక్కొట్టిన తెలుగోడు.. కన్నీటి పర్యంతమైన ముత్యాల రెడ్డి!(వీడియో)

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఈ తెలుగోడు అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. ఈ క్రమంలో 171 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.

నితీష్ కుమార్ రెడ్డి‌కి ఇదే తొలి టెస్ట్ సెంచరీ. గత మూడు టెస్ట్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42, 16 పరుగులతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న నితీష్.. తాజా మ్యాచ్‌లో మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో ఏకంగా సెంచరీనే సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి.. తనదైన బ్యాటింగ్‌తో 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Nitish Kumar Reddy Father Gets Tears After His Son Hits Maiden Test Century in IND vs AUS 4th Test

ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ సహకరించాడు. రిషభ్ పంత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్.. జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు. వాషింగ్టన్ సుందర్‌‌తో కలిసి 8 వికెట్‌కు ఏకంగా 117 పరుగులు జోడించాడు.

సెంచరీపై ఉత్కంఠ..
సుందర్, బుమ్రా వెనువెంటనే ఔటవ్వడంతో నితీష్ కుమార్ రెడ్డి శతకంపై ఉత్కంఠ నెలకొంది. కానీ సిరాజ్ అద్భుతంగా మూడు బంతులు డిఫెన్స్ చేసి నితీష్‌ కుమార్ రెడ్డికి స్ట్రైక్ ఇచ్చాడు. బోలాండ్ బౌలింగ్‌లో రెండు బంతులు డిఫెన్స్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మూడో బంతిని బౌండరీ తరలించి శతకాన్ని అందుకున్నాడు.

నితీష్ తండ్రి భావోద్వేగం..
నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అతని తండ్రి ముత్యాల రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. నితీష్ ఇన్నింగ్స్ చూసేందుకే వైజాగ్ నుంచి మెల్‌బోర్న్ వెళ్లిన ముత్యాల రెడ్డి.. కొడుకు సక్సెస్‌ను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

నితీష్ కుమార్ రెడ్డి కోసం ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశాడు. కొడుకును క్రికెటర్‌గా మార్చేందుకు 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లంతా నితీష్ కుమార్ రెడ్డికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

టీమిండియా 358/9
నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బ్యాటింగ్‌తో వర్షంతో మూడో రోజు ఆట నిలిచే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(176 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 105 బ్యాటింగ్)‌తో పాటు మహమ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, December 28, 2024, 12:04 [IST]
Other articles published on Dec 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+